Sri Sudha: శ్యామ్.కె.నాయుడు పెళ్లి చేసుకుంటానని మోసం.. అర్జున్ రెడ్డి నటి ఆవేదన..?
Sri Sudha: ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే మహిళా నటీనటులు అంటే చాలామందికి చులకన భావమే ఉంటుంది.. వారిని ఏదో ఒక విధంగా లొంగదీసుకోవాలని చూస్తారు.. అలా ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు పడి చివరికి ఆయన చేతిలో మోసపోయి, న్యాయం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది నటి శ్రీ సుధా.. ఆమె డాక్టర్ అయిన తర్వాత యాక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
Shyam K. Naidu cheated me Sri Sudha comments viral
తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను మోసం చేసిన చోటా కె నాయుడు, తమ్ముడు శ్యామ్ కె నాయుడు గురించి సంచలన ఆరోపణలు చేసింది. చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాతో కొన్నాళ్లపాటు గడిపి చివరికి మోసం చేశాడని ఆరోపించింది. అంతేకాదు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కోర్టు వరకు వెళ్ళింది. తనకు న్యాయం కావాలంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఆమె పోరాడుతోంది. (Sri Sudha)
Also Read: 1000 కోట్ల పటౌడీ ప్యాలెస్ కొనుగోలు.. సైఫ్ అలీ ఖాన్ అన్ని కష్టాలు పడ్డాడా?
కానీ ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు అతనిపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె తాజాగా ఆరోపణ చేసింది.. అయితే శ్యామ్ కె నాయుడుతో నేను కలిసి ఉన్న సమయంలో అనేక ఇబ్బందులు పడ్డానని ఆయన ప్రతిరోజు నాతో తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల వరకు ఏదో ఒక రకంగా టార్చర్ చేసేవాడని, మళ్లీ ఉదయం లేవగానే సైలెంట్ గా ఉండేవారని చెప్పుకొచ్చింది. ఆ టైంలో నేను నా ఫోన్లో ఆయన చేసిన అరాచకాల గురించి రికార్డు చేశాను కాబట్టి ఈరోజు నాకు ఈ కేసులో ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పుకొచ్చింది.
ఒకానొక సమయంలో ఆయన టార్చర్ భరించలేక తన అన్నయ్య చోటా కె నాయుడుకు చెబితే, నేను వాడితో మాట్లాడుతాను, నాకేం ఇస్తావు అంటూ మరో రకంగా మాట్లాడడని చెప్పుకొచ్చింది. ఇలా పది సంవత్సరాలుగా శ్యామ్ తో గొడవ జరుగుతోందని, ఇద్దరు అన్నదమ్ములు నన్ను దారుణంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.(Sri Sudha)