Mahesh Babu: మహేష్ ఒప్పుకొని ఉంటే నాగచైతన్య సమంత పెళ్లి చేసుకునే వారు కాదా.?
Mahesh Babu: ఏంటి సమంత నాగచైతన్య విడాకులకు కారణం మహేష్ బాబా.. ఈ విషయం ఎవరికీ తెలియదే అనుకుంటారు చాలామంది ఈ మాట వినగానే.అసలు నాగచైతన్య సమంత విడాకులతో ఎలాంటి సంబంధం లేని మహేష్ బాబు ఎలా కారణమయ్యారు అనుకుంటారు మరి కొంతమంది.. మరి ఇంతకీ దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. సమంత నాగచైతన్య విడాకులకు మహేష్ బాబు కారణం అని వార్తలు రావడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే ఏ మాయ చేసావే సినిమా..
Samantha divorce is because of Mahesh Babu
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత నాగచైతన్య హీరో హీరోయిన్ గా చేసిన ఏ మాయ చేసావే సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా హిట్ కొట్టడంతో పాటు సమంత నాగచైతన్యలు ఇద్దరు ప్రేమలో పడేట్లు కూడా చేసింది.ఈ సినిమా టైంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది.అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే..ఏమాయ చేసావే సినిమాలో హీరోగా ఫస్ట్ ఛాయిస్ నాగచైతన్య కాదట.(Mahesh Babu)
Also Read: Sai Durga Tej: ఆ హీరోయిన్ తో సాయి దుర్గ తేజ్ పెళ్లి.. చెల్లిని ఒప్పించిన చిరంజీవి..?
మొదట గౌతమ్ మీనన్ మహేష్ బాబుని తీసుకుందాం అనుకున్నారట.కానీ మహేష్ బాబు మాత్రం ఈ సినిమా కథ బాగున్నప్పటికీ ఈ కథ తన ఇమేజ్ కు తగ్గట్టు లేదని ఇందులో ఫైట్ సన్నివేశాలు లేవు,యాక్షన్ సీన్స్ లేవు ఇలాంటి సినిమాని నా అభిమానులు యాక్సెప్ట్ చేయరు అంటూ సున్నితంగా రిజెక్ట్ చేశారట. అయితే ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ చెప్పారు.ఆ తర్వాత శింబుకు కూడా ఈ కథ చెప్పినప్పటికీ చివరికి సమంత నాగచైతన్య కాంబోలో ఈ సినిమా తెరకెక్కింది.
అయితే ప్రస్తుతం గౌతమ్ మీనన్ మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ మహేష్ బాబు కనుక ఈ సినిమాకి ఒప్పుకొని ఉంటే నాగచైతన్య సమంతల మధ్య ప్రేమ చిగురించేది కాదు వాళ్ళు విడాకులు తీసుకునేవారు కాదు. మహేష్ బాబు ఈ సినిమా చేయకపోవడం వల్లే వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకొని చివరికి విడాకులు తీసుకున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Mahesh Babu)