Rashmika: సినిమాలకు రిటైర్మెంట్.. ఇదే నా లాస్ట్ మూవీ.. రష్మిక షాకింగ్ కామెంట్స్..?
Rashmika: హీరోయిన్ రష్మిక నిజంగానే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతుందా.. ఇదే నా లాస్ట్ మూవీ అని రష్మిక ఎందుకు చెప్పింది..ఆ మూవీ ఈవెంట్లో రష్మిక మాట్లాడిన మాటలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.చాలా మంది నటీమణులు సినిమాలు చేసి హిట్ కొట్టాక ఇక ఇక్కడితో చాలు అనుకొని సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత పిల్లలు పుట్టక కొన్ని సంవత్సరాలకు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు. అయితే ఈ హీరోయిన్ అలాంటిదేమీ లేకుండానే ఇదే నా లాస్ట్ మూవీ అంటే సంచలన వ్యాఖ్యలు చేసింది.
Rashmika shocking comments on Movie retirement
ఇక విషయంలోకి వెళ్తే..నటి రష్మిక మందన్నా బాలీవుడ్లో నటిస్తున్న తాజా మూవీ ఛావా.. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఆయన భార్య ఏసుభాయి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఇక శంభాజీ మహారాజ్ ఎవరో కాదు హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శివాజీ మహారాజ్ తనయుడు.. శంభాజీ మహారాజ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఛావా మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఏసుభాయి లుక్ కి సంబంధించి పోస్టర్ కూడా రీసెంట్గా విడుదల చేశారు. (Rashmika)
Also Read: 1000 కోట్ల పటౌడీ ప్యాలెస్ కొనుగోలు.. సైఫ్ అలీ ఖాన్ అన్ని కష్టాలు పడ్డాడా?
అయితే ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రష్మిక మాట్లాడుతూ.. నేను ఈ సినిమా చేశాక సంతోషంగా రిటైర్మెంట్ తీసుకుంటాను అని డైరెక్టర్ తో ఎన్నో సందరభాల్లో చెప్పాను. ఎందుకంటే అంత గొప్ప పాత్రలో నటించాను. ఇదే నా చివరి సినిమా అయినా సంతోషంగా సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తాను. ఈ సినిమా చేసే సమయంలో చాలాసార్లు భావోద్వేగానికి లోనయ్యాను.
ఇంత గొప్ప సినిమాలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నాను. ఈ సినిమాలో విక్కీ కౌశల్ నాకు దేవుడిలాగా కనిపించారు.. అంటూ రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఇక ఈ ఈవెంట్ కి రష్మిక మందన్నా కుంటుకుంటూనే వచ్చింది.. అయితే రష్మిక మందన్నా కాలు బెనకడంతో నడవలేని పరిస్థితిలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయినా కూడా తన సినిమా కోసం కష్టపడి మరీ ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వచ్చింది.(Rashmika)