Venu Swamy: మార్చి 30 తర్వాత అల్లు అర్జున్ జీవితం మారబోతుంది.. మళ్లీ టాలీవుడ్ ని కెలికిన వేణు స్వామి.?
Venu Swamy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా తెగ ట్రెండింగ్ లో ఉన్న పేరు వేణు స్వామి.. ఈయన సెలబ్రిటీల, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. ఏదో గాలిలో దీపం పెట్టినట్టు తెలిసి తెలియని జాతకాలు చెప్పి అది నిజమైతే నేను చెప్పింది నిజమైంది అంటాడు. లేదంటే సైలెంట్ గా ఉంటాడు. అలా ఎంతోమంది సెలబ్రిటీలను రాజకీయ నాయకులను నమ్మించి బాగానే సంపాదించారు వేణుస్వామి. అలాంటి వేణుస్వామి చెప్పిన జాతకాలు ప్రస్తుత కాలంలో చాలావరకు బెడిసి కొడుతున్నాయి.
Venu Swamy shocking comments on Allu Arjun
దీంతో ఆయనను సోషల్ మీడియా వేదికగా నేటిజన్స్ దారుణంగా తిట్టుకుంటున్నారు.. అలా వేణుస్వామి తాజాగా నాగచైతన్య, శోభిత దూలిపాళ జాతకాల గురించి చెప్పి వివాదాస్పదమయ్యాడు. ఆయన చేసిన కామెంట్స్ మహిళా కమిషన్ వరకు వెళ్ళింది. అయినా ఆయన జాతకాలు చెప్పడం మాత్రం మానడం లేదు. అలాంటి వేణు స్వామి తాజాగా అల్లు అర్జున్ సుకుమార్ సంబంధించిన విషయాలను బయటపెట్టారు.. తాజాగా ప్ పుష్ప2 సినిమా వల్ల అల్లు అర్జున్ కు సుకుమార్ కు ఎంతటి వివాదమైందో మనందరికీ తెలుసు. (Venu Swamy)
Also Read: Rashmika: సినిమాలకు రిటైర్మెంట్.. ఇదే నా లాస్ట్ మూవీ.. రష్మిక షాకింగ్ కామెంట్స్..?
దీన్ని ప్రస్తావిస్తూ వేణుస్వామికీ ముందుంది ముసళ్ళ పండుగ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇన్కమ్ టాక్స్ రైడ్స్ గురించి కూడా ఆయన మాట్లాడారు. తన జాతకం ప్రకారం అల్లు అర్జున్ ది కన్యా రాశి సుకుమారి కుంభరాశి.. వీళ్ళ జాతకాల్లో శని ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అన్నారు.
వీళ్ళిద్దరూ కలవడం వల్ల రాబోవు రోజుల్లో వీరి జీవితాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, దీని వల్ల వాళ్ల చుట్టుపక్కల ఉండేవారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు. ఇక వీరికి శని అనేది మార్చి 30 2025 వరకు కొనసాగుతుందని దీనివల్ల రాబోవు రోజుల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు. మార్చి 30 తర్వాత ఇవన్నీ వెళ్లిపోయి వీళ్లు మరింత ముందుకు వెళ్తారని అన్నారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Venu Swamy)