Biryani Leaves: ప్రతి ఇంట్లో ఆహారంలో ఉపయోగించే అనేక రకాల మసాలా దినుసులలో బిర్యానీ ఆకు ఒకటి. బిర్యానీ ఆకు కేవలం సువాసనకి మాత్రమే కాకుండా వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బిర్యానీ ఆకును తరచుగా ఆహారంలో ఉపయోగిస్తూనే ఉంటాం. దీని రుచి, వాసన అద్భుతంగా ఉంటుంది. Biryani Leaves
Biryani Leaves Benefits
ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు విపరీతంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో మినరల్స్, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బిర్యానీ ఆకులో కాల్షియం, ఐరన్, పొటాషియం, ఇతర పోషకాలు ఎన్నో దాగి ఉంటాయి. బిర్యానీ ఆకులను తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. Biryani Leaves
Also Read: Rohit Sharma: దిగివచ్చిన అంబానీ.. రోహిత్ కోసం భారీ స్కెచ్ ?
ఈ ఆకులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మధుమేహాన్ని సైతం నియంత్రించవచ్చు. బిర్యానీ ఆకులో మలబద్ధకం, ఆసిడిటీ, తిమ్మిరి, కడుపునొప్పి వంటి సమస్యలను తొలగించడానికి సహాయపడతాయి. బిర్యాని ఆకులను తిన్నట్లయితే తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు తొలగిపోవడమే కాకుండా కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి. Biryani Leaves
బిర్యానీ ఆకుని వేడి నీటిలో నానబెట్టుకొని ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే తాగినట్లయితే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఇలా నీటిలో బిర్యానీ ఆకులు వేసుకొని తాగినట్లయితే బరువు కూడా సులభంగా తగ్గుతారు. శరీరంలో ఏర్పడే కొవ్వు తొలగిపోతుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా మనం తీసుకునే ఆహారంలో బిర్యానీ ఆకును వేసుకోవాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Biryani Leaves