
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నవంబర్ 7వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.9,100 కోట్ల భారీ అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పో, భారీ బహిరంగ సభలతో పాటు అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఈ పర్యటన కేంద్రబిందువుగా మారనుంది. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి వేగాన్ని మరింత పరుగులు పెట్టించే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలను రూపొందించారు.
Revanth Reddy Kodangal Development Tour
ఈ పర్యటనలో మొదటి రోజైన శనివారం ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలోని యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను పరిశీలించి కొడంగల్ నివాసానికి చేరుకుంటారు.
రెండో రోజు నవంబర్ 8వ తేదీ ఉదయం స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమయ్యే సీఎం, ఆ తర్వాత పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తారు. బొంరాస్‌పేటలో జూనియర్ కళాశాల, కొడంగల్, దుద్యాల, హకీంపేట ప్రాంతాలలో నూతన పోలీస్ స్టేషన్లు, దుద్యాలలో రూ.12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. కోస్గి మండలం నాచారంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు–2కు శంకుస్థాపన చేసి, కోస్గిలో సైన్స్ మ్యూజియం, దౌల్తాబాద్‌లో పీహెచ్సీ, జూనియర్ కళాశాలను ప్రారంభిస్తారు.
పర్యటనలో చివరి రోజైన నవంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు హకీంపేటలో నిర్వహించనున్న భారీ రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో మౌలిక వసతులు, వ్యవసాయ రంగం మరియు పారిశ్రామికాభివృద్ధి మరింత పుంజుకోనున్నాయి. స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య, విద్య, రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానుండటంతో పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ప్రణాళికలు అమలువుతున్నాయి. ఈ కార్యక్రమాలతో నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేయనుంది.
మరింత అప్డేట్స్ కోసం: ఇక్కడ చూడండి
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





