Victory Venkatesh: ఐటీ రైడ్స్ పై విక్టరీ వెంకటేష్ సెటైర్!!
Victory Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.230 కోట్లు పైగా వసూలు చేయడం విశేషం.
ఇటీవల, ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ, టాలీవుడ్లో జరుగుతున్న ఐటీ రైడ్స్ పై సరదాగా స్పందించారు. తనకు ఈ రైడ్స్ గురించి తెలియనట్లు నవ్వుతూ కామెంట్ చేసిన వెంకటేష్, రెమ్యునరేషన్ గురించి కూడా ఆసక్తికరమైన మాటలు చెప్పారు. “నేను మొత్తం వైట్‌లోనే తీసుకుంటాను. మిగతా హీరోల గురించి నాకు తెలియదు,” అని ఆయన సెటైరిక్ గా స్పందించారు.
విక్టరీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రొడ్యూస్ చేశారు.