Andhra Pradesh: భారీగా పెట్టుబడుల వెల్లువ.. ఎన్ని వేల కోట్లు గ్రౌండింగ్ అంటే?

Andhra Pradesh CID: వెబ్‌ల్యాండ్ భూ రికార్డుల మార్పిడి కేసులో నలుగురి అరెస్ట్

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగవంతమైంది. జూన్ 2024 నుంచి అందిన మొత్తం 714 పెట్టుబడి ప్రతిపాదనల్లో 526 ప్రాజెక్టులు విజయవంతంగా కార్యరూపం దాల్చాయి. దాదాపు 74 శాతం విజయవంతమైన మార్పిడి రేటుతో పారిశ్రామిక రంగంలో రాష్ట్రం దూసుకుపోతోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 17.2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి.

Andhra Pradesh Investment Success Rate

ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తం 22.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పైప్‌లైన్‌లో ఉండగా, అందులో 76 శాతం ఇప్పటికే ఖరారయ్యాయి. ఎంఓయూలను వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ప్రతి దశను నిశితంగా పరిశీలిస్తోంది.

ఇప్పటికే 7.1 లక్షల కోట్ల రూపాయల విలువైన 303 ప్రాజెక్టులు గ్రౌండింగ్ దశకు చేరుకున్నాయి. వీటి ద్వారా 7.7 లక్షల ఉద్యోగాల సృష్టి జరగనుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్, అమరావతి క్వాంటం వ్యాలీ, శ్రీహరికోట సమీపంలో స్పేస్ సిటీ వంటి అత్యాధునిక సాంకేతిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చనున్నాయి.

ఇవి కూడా చదవండి:

నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్, పుడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, రామాయపట్నంలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వంటి భారీ ప్రాజెక్టులు ప్రగతికి చోదక శక్తిగా నిలవనున్నాయి. అనంతపురంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, భోగాపురంలో ఏవియేషన్ హబ్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయి.

మరిన్ని వార్తల కోసం..


Visited 1 times, 1 visit(s) today

Leave a Comment