Akhil Jainab Wedding: అక్కినేని అఖిల్ – జైనాబ్ వివాహం : ముహూర్తం ఫిక్స్, వివాహం ఎక్కడంటే?

https://twitter.com/search?q=%23vijaydeverakonda&src=typed_query&f=liveThe hand of the hero wife behind the love story of Akhil-Zainab

Akhil Jainab Wedding: అక్కినేని ఫ్యామిలీకి చెందిన అఖిల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. జైనాబ్ రవడ్జీతో అతని నిశ్చితార్థం ఇటీవలే జరిగిపోయింది. ఇప్పుడు ఈ కొత్త జంట తమ వివాహం కోసం మార్చి 24ని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొదట, వీరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్గా జరపాలని భావించినప్పటికీ, అన్నపూర్ణ స్టూడియోలోనే వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయి.

అన్నపూర్ణ స్టూడియో అక్కినేని కుటుంబానికి ఎంతో ముఖ్యమైన స్థలం కావడంతో, నాగచైతన్య-శోభిత ధూళిపాళ వివాహం కూడా ఇక్కడే జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అఖిల్ మరియు జైనాబ్ వివాహం కూడా ఇక్కడే జరగనున్నట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోతో అక్కినేని ఫ్యామిలీకి బలమైన భావోద్వేగ బాంధవ్యముంది, అందుకే వారు ఈ ప్రత్యేక స్థలంలో వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు.

ఇప్పుడు, ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవడానికి కొం సమయం పడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *