Rana Naidu Season 2: వెంకీ మామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!!


Venkatesh's Upcoming Web Series "Rana Naidu" Season 2: New Precautions After Season 1 Criticisms

Rana Naidu Season 2: టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”తో ఘన విజయం సాధించారు. ఈ సినిమా తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కానీ, ఈ సినిమా విజయానికి ముందు, వెంకటేష్ ఓ మరింత ఆసక్తికర ప్రాజెక్ట్ పై కూడా దృష్టి పెట్టారు. ఆ ప్రాజెక్ట్ వెంకీ కి కొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ సిరీస్ కి కొనసాగింపుగా “రానా నాయుడు సీజన్ 2” అనే వెబ్ సిరీస్ వస్తుంది. ఈ సిరీస్‌లో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

సీజన్ 1 అనేక వైవిధ్యమైన నెగిటివ్ కామెంట్స్ ను ఎదుర్కొన్నప్పటికీ, సీజన్ 2 ను మేకర్స్ అనౌన్స్ చేసి, షూటింగ్ కూడా పూర్తి చేశారు. తాజా సమాచారం ప్రకారం, విక్టరీ వెంకటేష్ తన “రానా నాయుడు సీజన్ 1” పై వచ్చిన విమర్శలు సీజన్ 2 లో పునరావృత్తి అవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ సిరీస్ ను త్వరలో నెట్‌ఫ్లిక్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేయబడ్డాయి. డబ్బింగ్ కూడా పూర్తి అయ్యింది. “రానా నాయుడు సీజన్ 2” కోసం వెంకీ మామ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *