Curry Leaves Juice: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బయటి ఆహారాన్ని ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ తినడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గడానికి చాలామంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఫెయిల్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకునే ఆహారాన్ని తినడంతో పాటు కొన్ని రకాల ఆహార నియమాలు పాటించినట్లయితే బరువును సులభంగా తగ్గవచ్చు. బరువు తగ్గడానికి పనిచేసే వాటిలో కరివేపాకు ఒకటి. కరివేపాకు ను చాలా మంది సువాసన కోసం మాత్రమే వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటారు. Curry Leaves Juice

Drinking Curry Leaves Juice every day will loss weight

చాలామంది ఈ ఆకుని చట్నీ పొడి లాంటివి తయారు చేసుకుంటారు. ముఖ్యంగా మసాలా వంటకాలలో కరివేపాకు తప్పనిసరి. ఇది రుచిని సువాసనను పెంచుతుంది. చాలా మంది ఈ కరివేపాకుని తినకుండా పడేస్తూ ఉంటారు. అలా చేయకుండా కరివేపాకుని తిన్నట్లయితే శరీరంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుందని చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఊబకాయాన్ని తగ్గించడంలో కరివేపాకు ఆకులు ఎంతో బాగా పనిచేస్తాయి. Curry Leaves Juice

Also Read: Infinix Note 40 5G: ఇన్‌ఫినిక్స్ నుంచి క్రేజీ ఫోన్…ధర, ఫీచర్స్ ఇవే..108 మెగా పిక్సెల్ కూడా ?

కరివేపాకులో కాల్షియం, విటమిన్స్, ఫైబర్, పీచు పదార్థం మొదలైన పోషకాలు ఉండడం వల్ల శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా చాలా మందికి పొట్ట నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. ఇలాంటి వారు కరివేపాకు క్రమంగా తినడం వల్ల కొవ్వు కరుగుతుంది. ముఖ్యంగా కరివేపాకును ఒక గ్లాస్ నీటిలో రసం చేసుకొని తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గుండె చుట్టూ పేరుకుపోయిన కొవ్వును నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు కరివేపాకు చాలా మంచిది. ఇందులో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుంది. కరివేపాకు రసాన్ని ప్రతిరోజు ఒక గ్లాసు తీసుకున్నట్లయితే అజీర్ణ సమస్యలు తొలగిపోతాయి. Curry Leaves Juice

ఏసిడిటీ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో ఉడకబెట్టుకోవాలి. ఆ నీటిని వడగట్టుకుని ఉదయం పూట తాగాలి. ఆ వడగట్టుకున్న నీటిలో కాస్త నిమ్మరసం, ఒక చెంచాడు తేనెను కలుపుకొని తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక చాలామంది ఈ కరివేపాకు పొడిని తినడానికి ఇష్టపడరు. అలాంటివారు కరివేపాకును పేస్టులా చేసి దీనిని దోస లేదా ఇడ్లీ వంటి టిఫిన్స్ కి చట్నీలా వాడుకోవాలి. అంతేకాకుండా చాలామంది కరివేపాకును తొక్కు లాగా తయారు చేసుకుని తిన్నట్లయితే చాలా మంచి పోషకాలు లభిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు కరివేపాకుని తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Curry Leaves Juice