Pushpa-3: పుష్ప-3లో ఐటెం డాన్సర్ గా స్టార్ హీరోయిన్.. కన్ఫామ్ చేసిన దేవిశ్రీ.?
Pushpa-3: పుష్ప -1, పుష్ప-2 ఈ రెండు సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసిన సమంత, శ్రీలీల కి ఎంత పేరు వచ్చిందో చెప్పనక్కర్లేదు. అయితే పుష్ప-3 లో ఆ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తే బాగుంటుంది అని తన మనసులో మాట బయట పెట్టేసారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్.. దేవిశ్రీప్రసాద్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్ప-3 ర్యాంపేజ్ గురించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట పెట్టారు.
Star heroine as an item dancer in Pushpa-3
ఆయన మాట్లాడుతూ.. నేను ఇప్పటివరకు మ్యూజిక్ డైరెక్టర్గా చేసిన చాలా సినిమాల్లో ఎంతోమంది పెద్ద హీరోయిన్లు నేను మ్యూజిక్ అందించిన పాటల ద్వారానే ఐటెం సాంగ్స్ చేశారు.అలా సమంత ఊ అంటావా మావా ఉఊ అంటావా, పూజ హెగ్డే జిగేల్ రాణి, కాజల్ పక్కా లోకల్,శ్రీ లీల కిసిక్కు ఈ హీరోయిన్ లందరూ నా పాటల ద్వారానే ఐటెం సాంగ్స్ చేశారు.(Pushpa-3)
Also Read: Ram Charan: గేమ్ చేంజర్ ఎఫెక్ట్.. RC16 కి ఆ టైటిల్ వద్దంటున్న ఫ్యాన్స్!!
ఇంత పెద్ద హీరోయిన్లు నా పాటలతో ఐటెం డాన్సర్స్ గా మారడం నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది.అలాగే పుష్ప-3 లో ఐటెం డాన్సర్ గా చేసే అవకాశం జాన్వీ కపూర్ కి ఇస్తే బాగుంటుంది. నేను ఇప్పటివరకు జాన్వీ కపూర్ చేసిన సినిమాలు ఎన్నో చూశాను.. ఆమె డాన్స్ బాగుంటుంది. జాన్వీ కపూర్ పుష్ప-3 లో ఐటమ్ సాంగ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం..
ఫైనల్ గా పుష్ప-3 లో జాన్వీ కపూర్ ఐటెం డాన్స్ కి పర్ఫెక్ట్ దేవి శ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు. అలాగే పుష్ప సిరీస్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ స్పెషల్ గా నిలిచాయి. అందుకే పుష్ప-3 కూడా జాన్వీ కపూర్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే నాకు ఇష్టమైన డాన్సర్ సాయి పల్లవి అంటూ దేవిశ్రీప్రసాద్ చెప్పుకు వచ్చారు. దీంతో పుష్ప -3 మూవీ పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.(Pushpa-3)