Colours Swathi: కలర్స్ స్వాతి విడాకులు.. ఫైనల్ గా క్లారిటీ.?
Colours Swathi: స్వాతి రెడ్డి..ఈమెను ఇండస్ట్రీలో ఉన్న వారందరూ కలర్స్ స్వాతి అని పిలుస్తారు. అయితే కలర్స్ అనేది ఆమె ఇంటిపేరు కాదు. కానీ ఆమె కలర్స్ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అవ్వడంతో ఇండస్ట్రీలో కలర్స్ స్వాతిగా మారిపోయింది. అలాంటి ఈ హీరోయిన్ మొదట ఇండస్ట్రీకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా చేసింది. అలా కలర్స్ స్వాతి నటించిన కార్తికేయ, బంగారు కోడిపెట్ట, త్రిపుర,అష్ట చమ్మా,స్వామి రారా, కలవరమాయే మదిలో వంటి సినిమాలు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.
Colours Swathi Divorce
అలాగే త్రిష వెంకటేష్ కాంబోలో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో త్రిష చెల్లెలు పాత్రలో వెంకీని ఇష్టపడే అమ్మాయిగా కలర్స్ స్వాతి తన నటనతో అదరగొట్టింది. అయితే అలాంటి స్వాతి పెళ్లయ్యాక కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండి మళ్ళీ సినిమాల్లో నటిస్తుంది.అయితే గత ఏడాది నుండి సినిమాల్లో మరింత యాక్టివ్ అవ్వడంతో పాటు తన భర్తతో విడాకులు తీసుకుంది అనే రూమర్ కూడా ఎక్కువగా వినిపిస్తోంది.( Colours Swathi)
Also Read: Akhil Jainab Wedding: అక్కినేని అఖిల్ – జైనాబ్ వివాహం : ముహూర్తం ఫిక్స్, వివాహం ఎక్కడంటే?
ఇక కలర్ స్వాతి నటించి గత ఏడాది వచ్చిన మంత్స్ ఆఫ్ మధు సినిమా ప్రమోషన్స్ లో మీరు మీ భర్తతో దూరంగా ఉంటున్నారా.. విడాకులు తీసుకున్నారా అనే ప్రశ్న ఎదురవగా దానికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా ఆ ప్రశ్నని దాటవేసింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కలర్స్ స్వాతి నిజంగానే తన భర్తతో విడాకులు తీసుకున్నట్టు కన్ఫర్మ్ అయింది.
ఎందుకంటే చాలామంది సెలెబ్రిటీలు విడాకులు తీసుకునే ముందు తమ భాగస్వామికి సంబంధించిన ఫోటోలు తమ సోషల్ మీడియా ఖాతా నుండి డిలీట్ చేస్తారు.అలా తాజాగా కలర్స్ స్వాతి కూడా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా నుండి డిలీట్ చేయడంతో వీరిద్దరు నిజంగానే విడాకులు తీసుకున్నారని కన్ఫర్మ్ అయింది. కలర్స్ స్వాతి వికాస్ వాసుని 2018లో పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లయ్యాక కొద్ది రోజులు బాగానే ఉన్న ఈ నటి గత ఏడాది విడాకులు తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.( Colours Swathi)