Sapota Fruit: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. నేటి కాలంలో చాలామంది కలుషితమైన ఆహారాన్ని తింటూ అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కరు తప్పకుండా ఆహారంతో పాటు పండ్లను తప్పకుండా తినాలి. Sapota Fruit
Sapota Fruit Health Benifits
అలా తిన్నట్లయితే మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా అందుతాయి. ఇక ప్రతి ఒక్కరూ సపోటా పండ్లను తినాలని…. దానివల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సపోటా పండ్లలో విటమిన్లు ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల కళ్ల ఆరోగ్యానికి మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ సి, బి, డి, ఖనిజాలు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. Sapota Fruit
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మకు రూ. 50 కోట్లు దండగ….?
ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుతాయి. సపోటాలో పొటాషియం, కాల్షియం, ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఎముకల సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. సపోటాలో ఫైబర్, ఫాస్పరస్, కాల్షియం ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. Sapota Fruit
సపోటాలో ఉండే ప్రోటీన్లు శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా అలసట, నీరసం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. సపోటాలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ముఖ్యపాత్ర పోషిస్తాయి. చిన్నపిల్లలకు కూడా సపోటా పండ్లను తినిపించడం అలవాటు చేయాలి. దానివల్ల వారి పెరుగుదలలో ఎలాంటి లోపాలు లేకుండా చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా…. కళ్ళఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. Sapota Fruit