Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ ఎవరితో? చిరునా..బాలయ్యనా??
Anil Ravipudi: టాలీవుడ్‌లో హిట్‌ల దర్శకుడిగా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి, వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఘన విజయం సాధించింది. రమణగోగుల వాయిస్‌తో “గోదారి గట్టు మీద…” పాటను రీక్రియేట్ చేసి, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచారు. తన మార్క్ కామెడీ, యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో కమర్షియల్ సినిమాలకు కొత్త ఊపునిచ్చారు. ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్ట్ పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ప్రేక్షకుల అభిరుచిని అద్భుతంగా అర్థం చేసుకుని, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వెంకటేష్ కెరీర్‌లో మరో మైలురాయి నెలకొల్పారు. ఇప్పుడు బాలకృష్ణతో మరో పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భగవంత్ కేసరి వంటి బ్లాక్‌బస్టర్‌ను బాలయ్యకు అందించిన ఆయన, మళ్లీ అదే విజయాన్ని రిపీట్ చేయాలనుకుంటున్నారు.
అయితే మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయాలనే డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఆయనకు ఉంది. ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్న చిరంజీవి, అనిల్ రావిపూడికి ఎప్పుడు కాల్షీట్స్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. చిరంజీవితో ఒక మాస్ ఎంటర్‌టైనర్ తీస్తే, అది ఇండస్ట్రీలో ఓ పెద్ద సెన్సేషన్ అవ్వడం ఖాయం. ఈ రెండు ప్రాజెక్ట్స్‌లో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళ్తుందనేది చూడాల్సి ఉంది. ఏదైనా, అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఇవ్వడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.