Allu Arjun: దుల్కర్ సల్మాన్ సినిమా వేడుకకు రానున్న ఐకాన్ స్టార్.. ఎప్పుడంటే?

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది.

Allu arjun it attend latest

పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.

హైదరాబాద్ వేదికగా నవంబర్ 15న ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన ఈ అప్డేట్ మూవీ ప్రమోషన్లకు కొత్త ఊపునిచ్చింది. ఐకాన్ స్టార్ రాకతో ఈ వేడుక మరింత ప్రతిష్టాత్మకంగా మారనుంది.

ఇవి కూడా చదవండి:

ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోలు కనిపించనుండటం అభిమానులకు కనువిందుగా మారనుంది. దూకుడుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్ర బృందం, ఈ ఈవెంట్ ద్వారా సినిమాపై అంచనాలను మరింత పెంచాలని భావిస్తోంది.

మరిన్ని వార్తల కోసం..



Visited 1 times, 1 visit(s) today