Dates: ఖర్జూరపండ్లు తెగ తింటున్నారా? అయితే జాగ్రత్త!

Dates: ఖర్జూర పండును చూడగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఖర్జూరంలోని ప్రక్టోజ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఖర్జూరంలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను వాపు, రక్తం సమస్యలను తొలగిస్తాయి. బీటా కెరటిన్, లూటీన్ అనే రుచికరమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వంటి హానికర పదార్థాలను అడ్డుకుంటాయి. ఇవి రొమ్ము, ఊపిరితిత్తులు, క్లోమా, క్యాన్సర్ నుంచి కొంతవరకు రక్షణ కలిగిస్తాయి.

Are you eating dates

ఇందులోని విటమిన్లు వృద్ధాప్యంలో వచ్చే రెటీనాలోని మాక్యుల క్షీణించకుండా కాపాడుతుంది. ఇది ఖర్జూరంలో అధికంగా ఉంటుంది. ఒంట్లో ద్రవాలు, గుండెలయ, రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గుండె మెదడు వంటి కీలక అవయవాలకు ఖర్జూరం ఎంతగానో మేలుం చేస్తుంది. ఇందులో బ్యాక్టీరియా వైరస్, ఫంగస్ ను ఎదుర్కొనే గుణాలు ఉంటాయి. ఆమ్లాలు సైతం అధికంగా ఉంటాయి. ఖర్జూరాలను రోజు పాలతో కలిపి తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు రెండు ఖర్జూరాలను గోరువెచ్చని పాలతో కలుపుకొని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

ఇది నాడీ వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. మెదడు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఖర్జూరంతో పాలు తాగడం వల్ల కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ డి,సి జింక్ వంటి అనేక పోషకాలు అందుతుంది. మలబద్దకం ఉన్నవారు రాత్రిపూట గోరువెచ్చని పాలు, రెండు ఖర్జూరాలను తీసుకుంటే చాలా మేలు కలుగుతుంది. నిద్ర కూడా మంచిగా పడుతుంది. పాలు, ఖర్జూరాలను కలిపి తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. కండరాల నొప్పి, అలసట వంటి మొదలైన అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *