
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకంలో రాష్ట్రం అద్భుత ప్రతిభ కనబరిచింది. వీధి వ్యాపారులకు ఆర్థిక స్వావలంబన కల్పించడంలో భాగంగా ఏడు జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలో జరిగిన స్వనిధి సమ్మాన్ అవార్డుల కార్యక్రమంలో కేంద్ర మంత్రి నుంచి మిషన్ అధికారులు ఈ పురస్కారాలను అందుకున్నారు.
Andhra Pradesh Wins Seven Awards
ఈ అవార్డుల్లో మూడు రాష్ట్ర స్థాయి గౌరవాలు ఉండగా, నాలుగు పురస్కారాలు పట్టణ స్థానిక సంస్థలకు దక్కాయి. ప్రత్యేక ప్రచార కార్యక్రమాల నిర్వహణలో దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా, రుణాల పంపిణీలో రెండో ర్యాంకును సాధించింది. అలాగే పథకం మొత్తం పనితీరు విభాగంలో మూడో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
పట్టణ స్థానిక సంస్థల విభాగంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ రుణాల పంపిణీలో రెండో స్థానంలో నిలిచింది. రామచంద్రాపురం మున్సిపాలిటీ స్వనిధి సే సమృద్ధి విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, అమలాపురం మున్సిపాలిటీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. వీటితో పాటు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిజిటల్ లావాదేవీల విభాగంలో రెండో ర్యాంకును సాధించి తన ప్రత్యేకతను చాటుకుంది.
ఇవి కూడా చదవండి:
- Panchayat: తెలంగాణ పంచాయతీలకు భారీగా తగ్గిన నిధులు.. ఎందుకంటే?
- Medical: హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ వార్డులు.. ఎక్కడంటే?
- Telangana Government: 540 ఎఫ్ఐఆర్లు.. రైస్ మిల్లర్లపై సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే?
వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని పని మూలధన రుణాలను అందించి, వారి వ్యాపారాలను పునరుద్ధరించడమే ఈ పథకం లక్ష్యం. డిజిటల్ లావాదేవీలు, ఆర్థిక అక్షరాస్యత మరియు సామాజిక భద్రతను ప్రోత్సహించడం ద్వారా వారిని స్వయం సమృద్ధులుగా మార్చేందుకు కృషి జరుగుతోంది. బలమైన సంస్థాగత సమన్వయం మరియు క్షేత్రస్థాయి అమలు వల్లే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని అధికారులు వెల్లడించారు.
చరిత్ర కథలు ఇష్టమా? మా తాజా హిస్టరీ వీడియో చూడండి: భారతదేశాన్ని ఆశించిన డచ్ వారు ఎవరు?
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





