Carrots: చాలా మంది ఇష్టంగా తినే వాటిలో క్యారెట్ ఒకటి. క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలును చేసే కూరగాయ. ఇది దుంప జాతికి చెందినది. ఒకానొక సమయంలో క్యారెట్ శీతాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. Carrots

Health Benefits Of Raw Carrots

క్యారెట్ తినడం వల్ల కాలేయం, కిడ్నీలు, కళ్ళు మెరుగుపడతాయి. క్యారెట్ తినడం వల్ల కళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. క్యారెట్ లో ఫైబర్ ఉండడం వల్ల ఇవి శరీరంలో ఏర్పడే అనేక రకాల వ్యాధులను తొలగిస్తాయి. ఇది రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను తొలగించి ఇన్సులిన్ గా ఉపయోగపడుతుంది. Carrots

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఇంటికొచ్చిన అగ‌స్త్య‌..ఇక జాతర షూరు?

క్యారెట్ ను పచ్చిగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇక కొంతమంది క్యారెట్ తో కూర కూడా వండుకుని తింటారు. ఇక మరికొందరు క్యారెట్ హల్వా కూడా తయారు చేసుకొని తింటారు. కొంతమంది డైట్ మెయింటైన్ చేసేవారు క్యారెట్ జ్యూస్ ప్రతిరోజు తప్పకుండా తాగుతారు. దీని వల్ల శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుంది. Carrots

అంతే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును నియంత్రిస్తుంది. క్యారెట్ లో పీచు పదార్థం ఉండడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి వేయదు. తద్వారా బరువు సులభంగా తగ్గుతారు. ప్రతిరోజు ఉదయం పూట ఒక క్యారెట్ తప్పకుండా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ తినడం నచ్చని వారు జ్యూస్ చేసుకుని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. Carrots