El Nino: నాగార్జున సాగర్ – శ్రీశైలం క్రూయిజ్ ప్రయాణం నిలిపివేత.. ఎందుకంటే?

El Nino

ప్రభావంతో తెలంగాణలో పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు నడిచే క్రూయిజ్ సర్వీసులను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) తాత్కాలికంగా నిలిపివేసింది. సాగర్‌లో నీటిమట్టం గణనీయంగా తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు.

El Nino Impacts Telangana Tourism

సాధారణంగా ఈ క్రూయిజ్ సర్వీసును నిర్వహించాలంటే నాగార్జున సాగర్ జలాశయంలో కనీసం 575 అడుగుల నీటిమట్టం ఉండాలి. అయితే ప్రస్తుత ఏడాది వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో నీటిమట్టం 503 అడుగులకు పడిపోయింది. దీంతో నదిలో బోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడి ప్రయాణాలను రద్దు చేయాల్సి వచ్చింది.

కార్తీక మాసం నేపథ్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం సోమశిల-శ్రీశైలం ప్యాకేజీని కూడా పర్యాటక శాఖ నిర్వహిస్తుంది. అయితే నీటి లభ్యత లేకపోవడంతో ఈ సర్వీసులపై కూడా ప్రభావం పడింది. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి నాగార్జున కొండ వరకు నడిచే బోటు సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా హైడ్రా ద్వారా పునరుద్ధరించబడిన చెరువుల్లో పెడల్ బోట్లు, స్పీడ్ బోట్లను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు. లక్నవరం వంటి ప్రాంతాల్లో కూడా నీటిమట్టం తగ్గుతుండటంతో కొత్త పర్యాటక అనుభవాలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..


చరిత్ర కథలు ఇష్టమా? మా తాజా హిస్టరీ వీడియో చూడండి: భారతదేశాన్ని ఆశించిన డచ్ వారు ఎవరు?

Visited 1 times, 1 visit(s) today