Sreeleela insulted the star hero with her head

Sreeleela: ఒకప్పుడు తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల ప్రస్తుతం అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూన్న ఈ ముద్దుగుమ్మ సౌత్ లో కూడా తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే రవితేజ తో ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ప్రాజెక్టుకి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

Sreeleela insulted the star hero with her head

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తన తల పొగరుతో ఓ స్టార్ హీరో ని దారుణంగా అవమానించిందట.మరి ఆ హీరో ఎవరు.. ఎందుకు శ్రీలీల ఆయన్ని అవమానించింది అనేది ఇప్పుడు చూద్దాం.. తమిళ్ దళపతి హీరో విజయ్ నటించిన తాజా సినిమా ది గోట్.. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ( Sreeleela)

Also Read: Varsha Bollamma: యంగ్ హీరోతో ప్రేమలో పడ్డ వర్ష బొల్లమ్మ..?

ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మీనాక్షిచౌదరి నటించగా స్పెషల్ సాంగ్ లో సీనియర్ నటి త్రిష చేసింది.అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మొదట చిత్రయూనిట్ శ్రీలీలని అనుకున్నారట. ఆమె దగ్గరికి వెళ్లి డేట్స్ కూడా తీసుకున్నారట. అయితే మొదట్లో ఓకే చెప్పి ఆ తర్వాత నేను నటించను అని చెప్పి ఆ హీరోని అవమానించిందట శ్రీలీల.

 Sreeleela insulted the star hero with her head

అయితే శ్రీ లీల ఆ పాటలో నటించకపోవడానికి కారణం ఐటెం సాంగ్ ద్వారా తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తే కోలీవుడ్లో తనకు అన్ని అలాంటి ఆఫర్సే వస్తాయని భయపడి ఆ స్పెషల్ సాంగ్ కి నో చెప్పిందట. కానీ ఈ విషయం తెలిసిన విజయ్ అభిమానులు అంత పెద్ద హీరో సినిమాలో అవకాశం వస్తే చేయనని చెప్పి నీ తల పొగరు తో ఆయన్ని అవమానిస్తావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.( Sreeleela)