RGV Syndicate:భారీ యాక్టర్స్ ను దించుతున్న రామ్ గోపాల్ వర్మ.. “సిండికేట్” లో అంత దమ్ముందా?
RGV Syndicate:వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి ప్రాజెక్ట్ “సిండికేట్” ను ప్రకటించారు. ఈ సినిమాను తన గత సినిమాలలా గొప్పగా రూపొందించనున్నారు. “సిండికేట్” కు సంబంధించి ఆయన తాజాగా వెల్లడించిన వివరాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రంలో గొప్ప నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారన్నారాయన. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు కొత్త పంథాను ఫాలో అవుతారన్నది తెలిసిందే. అలా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి మరింత ఎక్కువైంది.
RGV Syndicate Bollywood and Tollywood Unite
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటుడిని సినిమాకు తీసుకురావడం, సినిమాపై ప్రేక్షకుల్లో హైప్ పెంచింది. అలాగే, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఇద్దరు ప్రతిభావంతుల కలయిక సినిమాకు మరింత బలం చేకూరుస్తుంది. ఆర్జీవీ తన సినిమాలో నటుల నుండి అత్యుత్తమ నటనను రాబట్టగలరు, ఈ చిత్రంలో కూడా అదే రీతిగా భావిస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులకు “సిండికేట్” గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో వెంకటేష్ నటించవచ్చని ప్రచారం. వెంకటేష్‌తో ఆర్జీవీ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. “సంక్రాంతికి వస్తున్నాం” వంటి భారీ విజయం తర్వాత వెంకటేష్ పాత్రలో కనిపిస్తే, ఇది దక్షిణ భారత మార్కెట్లో సినిమాకు మరింత పాజిటివ్ బజ్ తీసుకురావడం ఖాయం. వెంకటేష్ మరియు రామ్ గోపాల్ వర్మ కలయిక యూనిక్ ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.
మరోవైపు, మనోజ్ బాజ్‌పేయి మరియు అనురాగ్ కశ్యప్ కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ తమ విభిన్నమైన నటనకు ఫేమస్. వారి చేరికతో “సిండికేట్” రేంజ్ మారే అవకాశం ఉంది. కథ, నటీనటులు, వర్మ శైలి – ఈ మూడు అంశాలు ఈ సినిమాను ప్రేక్షకులలో ఆసక్తి రేపెలా చేస్తాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరింత సమాచారం రావాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఆర్జీవీ కెరీర్లో మరో విశేషమైన మైలురాయి అవుతుందనడంలో సందేహం లేదు.