Anasuya: దేవిశ్రీని విసిగించిన అనసూయ.. కోపంతో దేవిశ్రీ ఏం చేశారో చూడండి.?
Anasuya: పుష్ప -2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో ఎంత ఘనంగా జరిగిందో చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఆ ఈవెంట్ లో మాట్లాడిన సెలబ్రిటీలు అందరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు.
See what Devi sri did with Anasuya anger
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది.అయితే దానికి సంబంధించిన ఓ వీడియో,ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది ఈ వీడియో పై ఫొటోస్ షేర్ చేస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే..స్టేజ్ మీదకి ఎక్కిన రాజమౌళి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ఆసక్తికరంగా మాట్లాడుతున్న సమయంలో దేవిశ్రీప్రసాద్ ఎక్జైటింగ్ గా చూస్తున్నారు.(Anasuya)
Also Read: Pushpa-2: పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించిన ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే.?
ఆ టైంలో ఆయన పక్కనే ఉన్న అనసూయ ఆయనతో ఏదో మాట్లాడి ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత జక్కన్న తన గురించి ఇంకా ఏం మాట్లాడతారా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న డిఎస్పీని మళ్లీ మళ్లీ అనసూయ డిస్టర్బ్ చేయడంతో కాస్త చిరాకు పడ్డట్లు ఫేస్ పెట్టాడు దేవిశ్రీప్రసాద్.
అయితే ప్రస్తుతం ఈ వీడియో,ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో దేవిశ్రీ ప్రసాద్ ని విసిగిస్తున్న అనసూయ.. అని కొంతమంది మీమ్స్ క్రియేట్ చేస్తే మరి కొంత మందేమో నా గురించి అంత పెద్దడైరెక్టర్ చెబుతుంటే ముచ్చటేసి వింటుంటే నువ్వేంటే మధ్యలో పానకంలో పుడకలాగా నన్ను తగులుకున్నావు.. అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ మీమ్స్ నెట్టింట వైరల్ గా మారాయి.(Anasuya)