Eggs: ఆరోగ్యానికి బలాన్ని చేకూర్చే ఆహరాలలో కోడిగుడ్డు ఒకటి. చాలామంది బరువు తగ్గడానికి ప్రతిరోజు గుడ్డు తింటారు. అంతేకాకుండా కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. డైట్ మెయింటెన్ చేసేవారు తప్పకుండా వారి ఫుడ్ లో దీనిని చేర్చుకుంటారు. అయితే గుడ్డులోని పచ్చసోన తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కేలరీలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. Eggs
Are you eating the egg yolk
పచ్చసొనలో విటమిన్లు, ఫాస్పరస్, జింక్, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా గుడ్డులోని పచ్చ సోన తినాలి. ఇది మెదడు కార్యకలాపాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. గుడ్డులోని పచ్చ సోన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. Eggs
Also Read: Shahid Afridi: పాక్ కుట్రలు…. సచిన్ బ్యాట్ తో ఆఫ్రిది సెంచరీ….?
తద్వారా బరువు తగ్గాలని అనుకునేవారు గుడ్డులోని పచ్చ సోన తినకపోవడం మంచిది. ఇక గుడ్డులోని తెల్ల సోనలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు దీనిని తప్పకుండా తినాలి. ఇందులో ప్రోటీన్ ఉండడం వల్ల శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుంది. కండరాల నిర్మాణానికి, బలానికి తెల్ల సోన ఎంతగానో సహాయపడతాయి. Eggs
ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు గుడ్డులోని తెల్ల సొనను తప్పకుండా తినాలి. చిన్నపిల్లలకు కూడా ప్రతిరోజు ఉదయం పూట ఒక గుడ్డు తప్పకుండా తినిపించాలి. తద్వారా వారి పెరుగుదలకు ఎలాంటి లోపాలు లేకుండా బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. Eggs