Brain Cancer: నేటికాలంలో మొబైల్ ఫోన్లు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే కొంతమంది పరిశోధకులు మొబైల్ ఫోన్లు వాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందని చెబుతూ ఉంటారు. అయితే తాజాగా ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఈ విషయంపై అధ్యయనం చేయడం జరిగింది. Brain Cancer

If you use too much phone, will you get brain cancer

మొబైల్ ఫోన్లు, వైర్లెస్ టెక్నాలజీని ఉపయోగించడంపై పలు కీలక విషయాలను వెల్లడించింది. మొబైల్ ఫోన్లు వాడడం వల్ల మెదడు లేదా తలకు సంబంధించిన ఎలాంటి క్యాన్సర్ రాదని, అందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు WHO(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) కనుగొనలేదని చెప్పారు. మొబైల్ ఫోన్లు వాడటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ మెదడు క్యాన్సర్ కి సంబంధం లేదు. Brain Cancer

Also Read: Deepthi Jeevanji: దీప్తి జివాంజీకి సీఎం రేవంత్ బంపర్ ఆఫర్ !

ఫోన్లు ఎక్కువగా వాడే సమయంలో దూరంగా పెట్టి వాడాలి. మొబైల్ ఫోన్లు రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. ఈ రెండు కారణాలతోనే మొబైల్ ఫోన్ల నుంచి బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందని కొంతమంది భయపడతారు. మొబైల్ ఫోన్లు రేడియో తరంగాల కారణంగా బ్రెయిన్ క్యాన్సర్ కి ఎలాంటి సంబంధం ఉండదు. కాకపోతే కొన్ని అనారోగ్య సమస్యలు మాత్రం వస్తాయని పరిశోధకులు అధ్యాయనంలో వెల్లడించారు. Brain Cancer

ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని, అంతేకాకుండా చిన్నపిల్లలకి ఫోన్లు అలవాటు చేసినట్లయితే అది వారికి ఒక వ్యసనం లాగా తయారు అవుతుందని దానివల్ల పిల్లలు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్లు కళ్ళపై ప్రభావాన్ని చూపిస్తాయి. తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. కానీ బ్రెయిన్ క్యాన్సర్ కి ఫోన్లకు ఎలాంటి సంబంధం లేదని పరిశోధకులు వెల్లడించారు. Brain Cancer