Jaggery With Chana: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, బలంగా ఉండడానికి ఎన్నో రకాల ఆహారాలను తింటూ ఉంటారు. అయితే మన శరీరాన్ని బలంగా తయారు చేసే వాటిలో ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం, మినరల్స్ ఉన్న ఆహారం తినడం చాలా ముఖ్యం. అయితే ఇందులో బెల్లం, శనిగలు ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శనగల్లో కాల్షియం, ప్రోటీన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు విపరీతంగా ఉంటాయి. Jaggery With Chana
Health Benfits Of Jaggery With Chana
బెల్లంలో ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. అయితే ఈ రెండిటిని కలిపి తినడం వల్ల శరీరానికి బలంతో పాటు ఎన్నో రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం శనిగలు, బెల్లం కలిపి తిన్నట్లయితే కండరాలు దృఢంగా తయారవుతాయి. ముఖ్యంగా యోగాలు, వ్యాయామాలు, జిమ్ కు వెళ్లేవారు వీటిని తప్పకుండా తినాలి. బెల్లంలో పొటాషియం ఉండడం వల్ల జీవక్రియను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు, ఊబకాయం. అయితే ఈ రెండింటిని తగ్గించే దివ్యమైన ఔషధం బెల్లం, శనిగలు. Jaggery With Chana
Also Read: IPL 2025: ఐపీఎల్ లో రూ.100 లకు కూడా బాబర్ అజామ్ ను కొనరు ?
ముఖ్యంగా ఈ రెండిటినీ కలిపి తినడం వల్ల ఏసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇవి జీర్ణశక్తిని బలంగా తయారు చేస్తాయి. ముఖ్యంగా డైట్ లో బెల్లం, శనగలు కలిపి తిన్నట్లయితే బరువు పెరగకుండా ఉంటారు ఈ రెండింటినీ కలిపి తిన్నట్లయితే ఎక్కువసేపు ఆకలి వేయదు. తద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. బెల్లం, శనగలు కలిపి తిన్నట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా మెదడు పనితీరు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోతాయి. చాలామంది బెల్లం, శనిగలు కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలియక దీనిని తినడానికి ఇష్టపడరు. అయితే ఈ రెండింటినీ కలిపి తిన్నట్లయితే కొండంత బలం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Jaggery With Chana