Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కోసం భారీ ప్లాన్ చేస్తున్న రాహుల్ సాంకృత్యాన్!!

Vijay Deverakonda Period Drama Film Update

Vijay Deverakonda: ‘శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో ఒక కీలక అతిథి పాత్ర ఉంటుందని, ఆ పాత్రలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారని సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొదటి షెడ్యూల్ వచ్చే నెల ప్రారంభమవుతుందని, ఇందులో విజయ్ దేవరకొండ ఎంట్రీ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.

Vijay Deverakonda Period Drama Film Update

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. 1854-1878 మధ్యకాలంలో సాగే ఈ కథ, చాలా వైవిధ్యమైన కంటెంట్‌ ఉన్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన గెటప్స్, సెట్టింగ్స్, విజువల్స్ అన్నీ ప్రేక్షకులను మరో కాలంలోకి తీసుకెళ్లేలా ఉంటాయట. ప్రము హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తుండటం మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ విషయం నిజమైతే, సినిమాకు అంతర్జాతీయ స్థాయి ఆకర్షణ దక్కుతుంది.

రాహుల్ సంకృత్యాన్ గతంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఈ సినిమా విజయంతో రాహుల్ నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆయన విజయ్ దేవరకొండతో పనిచేస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కథలోని ఎమోషనల్ డ్రామా, విజువల్ ఎఫెక్ట్స్, మరియు పాత్రల ప్రాముఖ్యత సినిమా విజయానికి కీలకమవుతాయని అంటున్నారు.

ఈ సినిమా విజయ్ దేవరకొండకు మరో భారీ హిట్‌గా నిలుస్తుందని టాక్. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సినిమా రూపొందించేందుకు రాహుల్ సంకృత్యాన్ టీమ్ నిమగ్నమై ఉంది. సరికొత్త కథ, నటీనటుల తారాగణం, మరియు ప్రొడక్షన్ విలువలు ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టేలా చేస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్స్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *