Priyanka Chopra: మహేష్ తో మూవీకి ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే.?

Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పుడు కూడా అదే స్టార్టం ఉంది కానీ ప్రస్తుతం బాలీవుడ్ ను దాటి హాలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ కూడా మంచి గుర్తింపు పొందుతోంది. అలాంటి ప్రియాంక చోప్రా త్వరలోనే రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో నటించబోతుందని తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారట. ఇందులో తీసుకునే ఆర్టిస్టులకు వర్క్ షాపులు, లుక్ టెస్టులు అన్నీ అయిపోయాయట.

Priyanka Chopra remuneration for the movie with Mahesh

Priyanka Chopra remuneration for the movie with Mahesh

ముఖ్యంగా ఈ టెస్టుల కోసం ప్రియాంక చోప్రాని న్యూ జెర్సీ నుంచి రప్పించారట రాజమౌళి.. అంత పెద్ద హీరోయిన్ నే హైదరాబాద్ తీసుకువచ్చారు అంటే ఆమెకు భారీగానే రెమ్యూనరేషన్ ఇస్తారని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆమెకు హాలీవుడ్ రెమినరేషన్ తో పోలిస్తే తెలుగులో ఎంత ఇచ్చిన తక్కువే. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ వదిలి హాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటిస్తోంది. అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా, వెబ్ సిరీస్ ల్లో దూసుకుపోతోంది. (Priyanka Chopra)

Also Read: Tandel movie: చైతు కి అంత సీన్ ఉందా.. భారీ బడ్జెట్.. భారీ రిస్క్!!

అయితే ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ సీటాడెల్ చిత్రం కోసం ఐదు మిలియన్ డాలర్ల పారితోషకం అందుకుందట. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 45 కోట్ల పైమాటే.. అంటే ఇక్కడ ఆమె ఫుల్ లెన్త్ హీరొయిన్ గా చేస్తే దాదాపు దానికి డబులు తీసుకుంటుంది అంటే 80 కోట్ల పైమాటే ఉంటుందని అంటున్నారు.. తనకు ఇచ్చే పారితోషికంతో ఏడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో వచ్చినటువంటి బాహుబలి లాంటి చిత్రాలను కూడా నిర్మించవచ్చని కొంతమంది భావిస్తున్నారు..

Priyanka Chopra remuneration for the movie with Mahesh

అంత పెద్ద పేరున్నటువంటి ప్రియాంక చోప్రాను రాజమౌళి రెండు సంవత్సరాల డేట్స్ బల్కుగా అడిగాట. అంతేకాదు ఈమెకు కేవలం పాతిక కోట్లు మాత్రమే పారితోషకం ఇస్తున్నారట.. దీనికి ప్రియాంక కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాజమౌళి తీసే సినిమా వరల్డ్ వైడ్ గా బాగా ఫేమస్ అవుతుంది. ఆమె హాలీవుడ్ లో ఇప్పటివరకు సైడ్ క్యారెక్టర్లు, సెకండ్ హీరోయిన్ తప్ప మెయిన్ హీరోయిన్ గా చేయలేదు. రాజమౌళి సినిమాతో ఆమె ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు పొందడమే కాకుండా హాలీవుడ్ లో కూడా మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్లు వస్తాయని తక్కువ పారితోషికానికే సినిమా ఒప్పుకుందని తెలుస్తోంది.(Priyanka Chopra)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *