Shazahn Padamsee: ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆరెంజ్ మూవీ హీరోయిన్..?
Shazahn Padamsee: ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ సెలబ్రిటీలు పెళ్లిళ్ల ద్వారా ఓ ఇంటి వారు అయిపోతున్నారు.. వారి పెళ్లిలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిని షాకుకు గురి చేస్తున్నారు.. అయితే తాజాగా రామ్ చరణ్ బ్యూటీ కూడా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు వివరాలు ఏంటో చూద్దాం..
Orange movie heroine Shazahn Padamsee who got engaged
రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఉన్నారు. అయితే ఆయన కెరియర్ మొదట్లో వచ్చినటువంటి చిత్రాల్లో ఎన్నో హిట్ అయ్యాయి మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆరెంజ్. ఈ సినిమా రిలీజ్ అయి చాలా ఏళ్లు అవుతోంది. ఈ సినిమా అప్పట్లో థియేటర్లోకి వచ్చి డిజాస్టర్ అయినా కానీ మ్యూజికల్ గా సూపర్ హిట్ అయింది. ఇందులో ఒక్కో పాట ఒక్కో స్పెషల్ అని చెప్పవచ్చు. (Shazahn Padamsee)
Also Read: Priyanka Chopra: మహేష్ తో మూవీకి ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే.?
లవర్స్ ఎంతో మెచ్చే రూబా రుబా అనే సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.. అలాంటి ఆరెంజ్ చిత్రంలో మొదటి హీరోయిన్ గా జెనీలియా నటించగా, రెండవ హీరోయిన్ గా షాజన్ పదంసీ నటించింది. ఈ చిత్రం ద్వారానే ఈమెకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. రూబ రూబ అనే పాట ద్వారా అప్పట్లో యూత్ ని డాన్స్ ఆడించిందని చెప్పవచ్చు.
అలాంటి ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంకటేష్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన మసాలా చిత్రంలో కూడా నటించింది. అయితే తాజాగా ఈ అమ్మడు తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ జరుపుకుందట. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు విషెస్ చెబుతున్నారు.(Shazahn Padamsee)