Rakul Preet Singh Made sensational comments

Rakul Preet Singh: బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు సౌత్ హీరోయిన్.. ఈమెకు సౌత్ లో ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు.. రకుల్ నటించిన చాలా సినిమాలు హిట్ అవ్వడంతో రకుల్ ప్రీత్ సింగ్ చాలా సంవత్సరాలు సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టింది.రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. నెపోటిజం కారణంగా నేను ఎన్నో సినిమాల్లో అవకాశాలు కోల్పోయాను.

Rakul Preet Singh Made sensational comments

ఒక రకంగా ఆ సినిమాల్లో అవకాశం కోల్పోవడంతో ఏడ్చేసాను కూడా.. ఒక సినిమాకు అయితే అగ్రిమెంట్ చేశాక వేరే హీరోయిన్ ని తీసుకున్నారు.ఇక మరో సినిమా అయితే చాలా ఘోరం..నాలుగు రోజులు షూటింగ్ చేశాక నన్ను అందులో నుండి తీసేశారు అంటూ ఏడ్చేసింది.అయితే రకుల్ ప్రీత్ సింగ్ నాలుగు రోజులు చేశాక తీసేసిన సినిమా మిస్టర్ ఫర్ఫెక్ట్.ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలుగా వినిపిస్తున్న మాట. (Rakul Preet Singh)

Also Read: Chinmayi: అసలు ఈ ఫోటోలు పంపి రమ్మన్నాడు.. స్టార్ సింగర్ బాగోతం బయటపెట్టిన చిన్మయి..?

మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ ని కాజల్ అగర్వాల్ ప్లేస్ లో తీసుకున్నారట.ఇక రకుల్ ప్రీత్ సింగ్ తో నాలుగు రోజులు షూటింగ్ కూడా చేశారట. కానీ ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ప్రభాస్ కి సరిపోవడం లేదని,రకుల్ చాలా సన్నగా, హైట్ ఎక్కువగా ఉండడం కారణంగా ప్రభాస్ కి జోడి సెట్ అవ్వడం లేదని, ఇద్దరి కాంబినేషన్ బాగాలేదని డైరెక్టర్,నిర్మాత అనుకొని రకుల్ ప్రీత్ సింగ్ ని తప్పించి ఆమె ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారట.

Rakul Preet Singh Made sensational comments

అయితే ఇదే విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఆ ఇంటర్వ్యూలో చెబుతూ.. ప్రభాస్ సినిమాలో నాకు అవకాశం వచ్చింది.నాలుగు రోజులు షూటింగ్ కూడా చేశాక నన్ను ఆ మూవీ నుండి తీసేశారు.ఇక ఆ విషయం తెలియగానే నేను చాలా ఏడ్చాను అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది..(Rakul Preet Singh)