HIT 3 special poster: హిట్ 3 నుంచి మరో లుక్ ను విడుదల చేసిన నాని!!
HIT 3 special poster: న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం “సరిపోదా శనివారం” సాలిడ్ హిట్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో నాని క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమా తర్వాత నాని నటిస్తున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం “హిట్ 3.” ఇది శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ హిట్ సిరీస్‌లో మూడో భాగం. నాని, శైలేష్ కొలనా కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
HIT 3 special poster Republic Day
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ అన్ని సినిమాపై ఆసక్తిని పెంచాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్‌కి ట్రీట్‌గా మారింది. ఈ పోస్టర్‌లో నాని అర్జున్ సర్కార్‌గా మాస్ లుక్‌లో కనిపించగా, గన్‌తో సెల్యూట్ చేస్తున్న స్టిల్ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేసింది. నాని లుక్ విభిన్నంగా ఉండటంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఇది ట్రెండింగ్‌గా మారింది.
యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. నిర్మాణ సంస్థ తాజా అప్‌డేట్ ప్రకారం, “హిట్ 3” ఈ మే 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. నాని, శైలేష్ కొలనా కాంబో క్రైమ్ థ్రిల్లర్‌లకు కొత్త శకం తెరుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
“హిట్ 3” మే 1న విడుదల అవుతున్న నేపథ్యంలో, ఫ్యాన్స్ సినిమాపై మరింత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. నాని లుక్, సినిమా కాన్సెప్ట్ సినిమాపై ఉన్న అంచనాలను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.