Simi Singh: భారత సంతతికి చెందిన ఓ స్టార్ క్రికెటర్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు. అతను మరెవరో కాదు ఐర్లాండ్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ సిమ్రంజీత్ సింగ్ అలియాస్ సిమి సింగ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే ఇతను ఇటీవలే లివర్ సమస్యతో బాధపడుతున్నాడు. అందుకోసం ఆస్పత్రిలో చేరిన సిమి సింగ్ గురుగ్రామ్ లోని మేదాంతలోని ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో డాక్టర్లు పెట్టడం జరిగింది. Simi Singh
ireland all rounder simi singh on path to recovery From liver transplant surgery
అయితే కాలేయ మార్పిడి చేస్తే కానీ అతడు బతకడని డాక్టర్లు తేల్చి చెప్పారు. తాజాగా ఇప్పుడు సిమి సింగ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేసుకున్నాడు. తన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయిందని వెల్లడించాడు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితిని సిమి సింగ్ తెలిపాడు. ”హాయ్ ఫ్రెండ్స్… నా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. Simi Singh
Also Read: Virat Kohli: ఒకే టీమ్‌లో కోహ్లీ, బాబర్.. ఇక ఫాన్స్ కు పండగే ?
ఈ చికిత్స కోసం డాక్టర్లు 12 గంటల పాటు శ్రమించారు. ఇప్పుడు నేను కోలుకునే ప్రక్రియలో ఉన్నాను. తప్పుడు యాంటీబయోటిక్, స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల నా కాలేయం దెబ్బతింది. అయితే చివరకు నా భార్య దాతగా మారి నాకు కాలేయ దానం చేసింది. నేను చాలా అదృష్టవంతుడిని. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని సిమి సింగ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నాడు. ఇక సిమీ సింగ్ కోలుకున్నాడని తెలిసి తన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సిమికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.