Atibala: అతిబల చెట్టు చాలామందికి తెలిసే ఉంటుంది. దీనిని ముదురు బెండ అని కూడా అంటారు. ఇది పల్లెటూర్లలో ఎక్కువగా లభిస్తుంది. దీనికి పూసే పూలు పసుపు రంగులో ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు. కానీ ఇది చూడడానికి పిచ్చి మొక్కగా కనిపిస్తుంది. ఈ చెట్టు శరీరానికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. ఈ ఆకుల రసాన్ని వారానికి రెండు మూడు సార్లు సేవించడం వల్ల శరీరంలో నీరసం, అలసట తగ్గి చాలా చురుగ్గా తయారవుతారు. Atibala
Atibala plant in telugu uses
ముఖ్యంగా ఈ చెట్టు కంటి సమస్యలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. కళ్ళ సమస్యల కోసం ముదురు బెండ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో కళ్ళను కడుగుతూ ఉంటే కంటికి ఉన్న దోషాలు తొలగిపోతాయి. అంతేకాక కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటివారు వారంలో నాలుగు సార్లు ముదురుబెండ ఆకులను నీటిలో మరిగించి…. కషాయం లాగా తయారు చేసుకుని తాగినట్లయితే కిడ్నీలో రాళ్లు సులభంగా కరిగిపోతాయి. Atibala
Also Read: Hardik Pandya: ఒక్కరితో కాదు.. 10 మందితో పాండ్యాకు రిలేషన్?
అయితే ఇందులో స్పటిక బెల్లం, చెక్కెర కలుపుకొని తాగాలి. ఇలా తాగడం వల్ల మూత్రంలో ఉండే ఇన్ఫెక్షన్లు కూడా తొలగిపోతాయి. జ్వరం వచ్చిన వారు కూడా ఈ రసాన్ని తాగినట్లయితే చాలా తొందరగా కోలుకుంటారు. అయితే ఈ చెట్టు పేరులో ఉన్నట్టుగానే అతిబల చెట్టు శరీరానికి ఎంతో బలాన్ని చేకూరుస్తుందని కానీ దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలియక చాలా మంది దీనిని పిచ్చి మొక్కగా భావిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చెట్టు ఎక్కడ కనిపించినా వదలకుండా తీసుకొచ్చి కషాయం రూపంలో తయారు చేసుకొని తాగాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Atibala