Tandel movie: ఏం ప్లానింగ్ బాసూ.. “తండేల్” ప్రమోషన్స్ మాములుగా లేవుగా!!
Tandel movie: టాలీవుడ్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో “తండేల్” ఒకటి. యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం అనౌన్సు అయినప్పటి నుండి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన పాటలు కూడా ఆకట్టుకున్నాయి, వీటి ద్వారా సినిమా మీద అంచనాలు పెరిగాయి.
Tandel movie latest updates and details
సినిమా ప్రమోషన్స్ని మేకర్స్ ఇప్పటికే ప్రారంభించారు. తాజాగా, చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు చర్చించబోతున్నారు.
ఇకపోతే “తండేల్” ట్రైలర్ను జనవరి 28న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా, ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్ లు ప్రేక్షకులలో ఈ మూవీ పై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ రెండో సారి ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే వీరు లవ్ స్టొరీ సినిమాలో నటించారు. దర్శకుడు చందూ మొండేటి తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధింస్తుందో చూడాలి.