SSMB29: సైలెంట్‌గా షూటింగ్ మొదలెట్టేసిన రాజమౌళి

SSMB29: Rajamouli's surprise shooting update

SSMB29: దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం SSMB29. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజుల పాటు మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసింది.

SSMB29: Rajamouli’s surprise shooting update

వేసవిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని వార్తలు వచ్చినప్పటికీ, రాజమౌళి తనదైన శైలిలో సడన్ ట్విస్ట్ ఇచ్చారు. తక్కువ వ్యవధిలోనే రెండవ షెడ్యూల్‌కు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోనే అమెజాన్ అడవుల సెట్‌ను నిర్మించి, అక్కడే షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కోసం హైదరాబాద్ చేరుకున్న ప్రియాంక చోప్రా లుక్ టెస్ట్‌లో పాల్గొంటున్నారు. లుక్ ఫైనల్ కావడంతో త్వరలో ఆమె భాగం కూడా షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి తన గత చిత్రాలకు భిన్నంగా SSMB29 కోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

ఎలాంటి సమాచారం బయటకు రాకుండా సైలెంట్‌గా షూటింగ్ ప్రారంభించారు. నిర్మాణ విషయంలో వేగం కనబరుస్తున్నారు. షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి, గ్రాఫిక్స్‌కు ఎక్కువ సమయం కేటాయించేలా షెడ్యూల్స్ రూపొందిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రాజమౌళి రూపొందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *