Green Chillies : పచ్చిమిర్చి పక్కకు పెడుతున్నారా…అయితే ఇవి తెలుసుకోండి ?
Green Chillies: పచ్చిమిర్చి చూడడానికి ఎర్రగా, పచ్చగా ఉంటాయి. వీటిని తింటే కారంగా ఉంటాయని చాలామంది వీటికి దూరంగా ఉంటారు. కొంతమంది మాత్రం పచ్చిమిర్చి వంటలలో ప్రత్యేక రుచిని ఇస్తాయని ఒకటి రెండు అలా వేస్తూ ఉంటారు. వీటిని చట్నీలలో, పప్పు, వంటకాల్లో, పచ్చళ్లలో, మసాలా వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి పచ్చిమిర్చి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే అసలు దూరంగా ఉంచరు. పచ్చిమిర్చి ఆహారానికి కారపు రుచులు ఇస్తుంది. అందుకే ప్రతి ఇంట్లోనూ వీటిని తప్పనిసరిగా వాడుతారు. పచ్చిగా తినడం కూడా చాలా బాగుంటుంది.
Green Chili In Weight Loss
పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం బి-6 అధికంగా ఉంటాయి. రెండు, మూడు పచ్చి మిరపకాయలను రోజూ ఆహారంతో పాటు సలాడ్ రూపంలో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి మిరపకాయలను తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉండటమే కాకుండా అనేక ఆంటీ యాక్సిడెంట్లు కూడా లభిస్తాయి. పచ్చి మిరపకాయలలో ఆరోగ్యాన్ని చేకూర్చే సమ్మేళనాలు ఉంటాయి. ఇది నొప్పి నివారణగా పనిచేస్తుంది.
అందువల్ల దీని వినియోగం కండరాలు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. పచ్చి మిరపకాయ వినియోగం రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు పచ్చి మిరపకాయలను తప్పనిసరిగా తినాలి. ఇందులో విటమిన్ సి చర్మానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు పచ్చిమిరపకాయలను తినకపోవడమే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గ్యాస్, ఎలర్జీ సమస్యలు ఉన్నవారు పచ్చి మిరపకాయలను అసలు తీసుకోకూడదు. దీనివల్ల ఎలర్జీ ఎక్కువగా అవుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు కూడా పచ్చిమిరపకాయలను తినకపోవడమే మంచిది. అలాంటివారు పచ్చిమిరపకాయలను తిన్నట్లయితే చాతిలో మంట, గుండె నొప్పి సమస్యలు వస్తాయి.