Balakrishna:బాలకృష్ణ కి పద్మ భూషణ్ రావడానికి కారణం ఏంటో తెలుసా.. భారీ రెకమెండేశనే!!
Balakrishna: నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు 2025 ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును ప్రకటించి, దేశవ్యాప్తంగా ఆయన ప్రతిష్ఠను మరింతగా పెంచింది. బాలయ్య కేవలం నటుడిగానే కాకుండా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. ఆయన రాజకీయ, సినీ, సేవారంగాల్లో చేసిన విశేష సేవలకు గానూ ఈ అవార్డును ప్రకటించడంపై అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
How Balakrishna earned Padma Bhushan
ఇటీవల బాలకృష్ణ మీద మరో ఆసక్తికరమైన చర్చ వెలుగులోకి వచ్చింది. అది ఆయన కుడి బొటనవేలికి ధరించిన పచ్చరంగు ఉంగరం గురించి. ఈ ఉంగరం కారణంగా బాలయ్యకి అదృష్టం కలిసివస్తోందని, వరుస విజయాలతో పాటు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఫలితాన్ని ఈ ఉంగరం పవర్‌గా భావిస్తున్నారు. అదృష్టం (luck) తీసుకురావడంలో ఈ ఉంగరం ప్రత్యేకమని నమ్మకం ఉంది.
పచ్చరంగు ఉంగరాన్ని సాధారణంగా పన్నా రాయి లేదా ఎమరాల్డ్ రింగ్ అని పిలుస్తారు. ఇది ముఖ్యంగా బుధ గ్రహం శక్తిని అందిస్తుందని, వ్యాపార, కళారంగాల్లో పురోగతి కలిగిస్తుందని నమ్ముతారు. బాలకృష్ణ వంటి ప్రముఖులు, దీని శక్తిని విశ్వసిస్తూ ధరిస్తుంటారు. అంతేకాదు, మంచి వక్తగా పేరు తెచ్చుకోవడంలోనూ ఇది సహాయపడుతుందని పురోహితులు చెబుతారు.
ఉంగరాన్ని ధరించే ముందు, గంగాజలంతో శుద్ధి చేసి, ప్రత్యేక మంత్రాల జపం తరువాత ధరించడం ఆనవాయితీగా ఉంది. ఈ ఉంగరం ధారణతో బంధాలు మెరుగవుతాయని, చుట్టూ స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని నమ్ముతారు. మొత్తానికి, బాలయ్య పూజా శ్రద్ధతో పాటు పచ్చరంగు ఉంగరం మహిమతో పద్మభూషణ్ అవార్డు గెలుచుకున్నారు.