AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నేతృత్వంలో నీరు-చెట్టు పథకం కింద పాత బకాయిలు చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆగని సత్య ప్రసాద్‌లతో చంద్రబాబు ముఖ్యమైన చర్చలు జరిపారు. 2014-19 టీడీపీ పాలనలో చేపట్టిన నీరు-చెట్టు పథకం పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రధానంగా చర్చ జరిగింది.
AP CM Chandrababu Naidu Takes Key Decision
చర్చల అనంతరం, ఆర్థిక శాఖను చంద్రబాబు దశలవారీగా నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. మొదటి విడతగా రూ.259 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు సూచించారు. ఈ నిధులతో చెరువుల పూడికతీత, అభివృద్ధి వంటి పనులకు చేసిన చెల్లింపులు సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించారు.
Also Read: Jamili Elections: మోడీ బిగ్ స్కెచ్.. కూలనున్న చంద్రబాబు ప్రభుత్వం?
గత టీడీపీ హయాంలో ప్రారంభించిన ఈ పథకం, 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చెరిపేసింది. అయితే 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తే బకాయి బిల్లులు చెల్లిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే, పెండింగ్ బిల్లులకు మోక్షం తెచ్చే పనిని చంద్రబాబు తక్షణమే ప్రారంభించారు.
జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కూడా పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రాధాన్యత చూపించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులు, మరియు వాటి పై తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలు కూడా త్వరితగతిన అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.