Mass Jathara Expectations: వరుసగా ఐదు ఫ్లాప్ లు.. ఈ సారైనా మాస్ రాజ కి హిట్ వచ్చేనా?

Mass Jathara Expectations and Storyline

Mass Jathara Expectations: మాస్ మహారాజా రవితేజ తన అభిమానులను మళ్లీ అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన 75వ చిత్రం “మాస్ జాతర” టీజర్ విడుదల కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. టీజర్ చూస్తే రవితేజ మళ్లీ తన వింటేజ్ మాస్ స్టైల్‌లో కనిపించనుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ టీజర్‌ను ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని స్టైలిష్‌గా రూపొందించారు.

Mass Jathara Expectations and Storyline

ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో “సామజవరగమన” వంటి హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను, ఈ సినిమాను పూర్తి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. రవితేజ అభిమానులు ఆయన 75వ సినిమా ఎలా ఉండాలో ఊహించుకుంటున్నారో, అచ్చం అలాంటి కథనే తీసుకొచ్చారు. మాస్ రాజా అల్లరి మళ్లీ తెరపై చూడబోతున్నామన్న భావన టీజర్‌తో స్పష్టమైంది.

“ధమాకా” వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ “రావణాసుర,” “టైగర్ నాగేశ్వరరావు,” “ఈగల్,” “మిస్టర్ బచ్చన్” వంటి చిత్రాలతో కొంత నిరాశపరిచారు. కానీ, “మాస్ జాతర” టీజర్‌లో కనిపిస్తున్న వింటేజ్ రవితేజ మళ్ళీ తన పాత మాస్ రూట్‌కు తిరిగి వచ్చినట్లు అనిపిస్తోంది. ఇది ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని అనిపిస్తోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రవితేజ, శ్రీలీల, భీమ్స్ కాంబినేషన్ మరోసారి “ధమాకా” తరహా మ్యూజికల్ హిట్ అందిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. రవితేజ తన 75వ సినిమాతో మళ్లీ బిగ్ హిట్ కొడతారా అని పరిశ్రమలో చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *