Pushpa 2 OTT: పుష్ప 2 బంపర్ ఆఫర్.. ఒటీటీ విడుదలతో పాటు!!
Pushpa 2 OTT: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2: ది రూల్” చిత్రం indian బాక్సాఫీస్‌ను కుదిపేసింది. 2024 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ₹1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతీయ సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. దర్శకుడు సుకుమార్ అందించిన ఈ విజువల్ మాస్టర్‌పీస్, 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌తో “రీలోడెడ్ వెర్షన్” రూపంలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. బలమైన థియేటర్ ఆక్యుపెన్సీతో ట్రేడ్ అనలిస్ట్‌లను ఆకట్టుకుంది.
Pushpa 2 OTT Release Announced
ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ లో దుమ్ము రేపడానికి సిద్ధమవుతుంది. ప్రముఖ OTT ప్లాట్ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ “పుష్ప 2” స్ట్రీమింగ్ విడుదల తేదీని ప్రకటించింది: 2025 జనవరి 30. 3 గంటల 44 నిమిషాల నిడివితో, ఈ వెర్షన్లో అదనపు 20 నిమిషాలు కలిగి ఉంటాయి. పుష్ప 2 పలు భాషల్లో అందుబాటులో ఉండి, అభిమానులకు మరింత అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.
ఈ OTT రిలీజ్ థియేటర్లలో పుష్ప 2 చూడలేని వారికి, అలాగే మెరుగైన వెర్షన్‌ను మరోసారి ఆస్వాదించాలనుకునే వారికి చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక్కడ కూడా ఈ సినిమా రికార్డులను సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, సునీల్ వంటి శక్తివంతమైన నటీనటులు “పుష్ప 2″లో మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్‌గా నిర్మించిన ఈ పాన్-ఇండియన్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదనపు స్కోరింగ్‌ను సామ్ సిఎస్ నిర్వహించారు.