SS Thaman: తమన్ శకం ముగియనుందా.. పెద్ద హీరోలు పక్కన పెట్టినట్లేనా?

SS Thaman Faces Tough Music Competition

SS Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు థమన్, పెద్ద బడ్జెట్ చిత్రాలకు పనిచేస్తూ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించారు. అయితే, రాబోయే కాలంలో ఇతర సంగీత దర్శకుల నుండి గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంది. థమన్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు సంగీతం అందించిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ యొక్క RC16 చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా, ఆయన తదుపరి సుకుమార్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆ విధంగా ఇప్పట్లో రామ్ చరణ్ కు చరణ్ సంగీతం అందించడు అనే చెప్పాలి.

SS Thaman Faces Tough Music Competition

అలాగే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమాలకు కమిట్ అయ్యారు. ఈ దర్శకులు సాధారణంగా తమకు నచ్చిన సంగీత దర్శకులతో పని చేయడాన్ని ప్రాధాన్యం ఇస్తారు, కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో థమన్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

థమన్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న “రాజా సాబ్” చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే, ప్రభాస్ భవిష్యత్ చిత్రాలకు సంతోష్ నారాయణన్, హర్షవర్ధన్ రమేష్‌వర్, విశాల్ చంద్రశేఖర్, రవి బస్రూర్ వంటి సంగీత దర్శకులు పనిచేస్తుండటంతో, ఆయనకు పెద్ద హీరోల సినిమాల అవకాశాలు ఉండవనే చెప్పాలి. థమన్ ఈ ఏడాది పవన్ కళ్యాణ్ “OG” చిత్రానికి సంగీతం అందిస్తుండగా, భవిష్యత్తులో పవన్‌తో కలిసి పనిచేసే అవకాశాలు స్పష్టంగా లేవు. థమన్ రాబోయే ప్రాజెక్ట్‌లలో త్రివిక్రమ్ దర్శకత్వంలోని అల్లు అర్జున్ చిత్రం మరియు నందమూరి బాలకృష్ణ చిత్రాలు మాత్రమే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *