Double Ismart: డబల్ ఇస్మార్ట్ లో అంతగా ఏముంది.. రికార్డు స్థాయి లో వ్యూస్!!
Double Ismart: రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ, యూట్యూబ్‌లో హిందీ వెర్షన్ విడుదలై పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాకు రిలీజుకు ముందు భారీ అంచనాలు ఏర్పడినప్పటికీ, ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కు సీక్వెల్‌గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగించింది. అయితే, ఈ సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డు ను సృష్టించింది.
Double Ismart movie creates YouTube sensation
హిందీ వెర్షన్ విడుదలై ఒక అదిరిపోయే రికార్డు ను నెలకొల్పింది. 100 మిలియన్ వ్యూస్ తో, 1 మిలియన్ లైక్స్‌తో ఈ సినిమా యూట్యూబ్‌లో దుమ్ములేపింది. ఇది, సినిమా ఇండస్ట్రీ లోనే అరుదైన రికార్డు అని చెప్పాలి. డబుల్ ఇస్మార్ట్ తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ, యూట్యూబ్ హిందీ వెర్షన్లో భారీ విజయం సాధించడం మేకర్స్ ను సంతోషపెట్టింది.
సినిమా విడుదలపై వచ్చిన పెద్ద అంచనాలు, అనుకున్నట్లుగా ఫలించకపోవడంతో ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం అందుకోలేకపోయింది. కానీ, ఇప్పుడు ఈ సినిమా హిందీ వెర్షన్ ద్వారా క్రేజ్ ని అందుకుని, మేకర్స్ కి మరోసారి విజయాన్ని అందించింది. మరి ఈ రికార్డు పూరీ కి ఊపు తెస్తుందా అనేది చూడాలి.