Akhanda 2: ‘డాకు మహారాజ్’ తో చేయలేనిది ‘అఖండ 2’ తో బాలయ్య చేసేనా?
Akhanda 2: సంక్రాంతి బరిలో “డాకు మహారాజ్”సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు “అఖండ 2” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలయ్య కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన “అఖండ” చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా, నార్త్ ఆడియన్స్‌ని కూడా టార్గెట్ చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది.
Akhanda 2 Targets North Audience
“అఖండ” మొదటి భాగంలో అఘోరా పాత్రతో పాటు మాస్ యాక్షన్ సన్నివేశాలు, పంచ్ డైలాగులు, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలగలిపి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ కారణంగా “అఖండ” సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు సీక్వెల్‌లో బాలయ్య తన మాస్ ఇమేజ్‌కు తగ్గ కొత్త డైలాగులు, పవర్‌ఫుల్ ఫైట్స్, ఇంకా ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్‌ను యాడ్ చేస్తున్నట్లు సమాచారం.
సినిమా షూటింగ్‌ను మహాకుంభమేళాలో ప్రారంభించిన చిత్రబృందం, అక్కడ ప్రత్యేకంగా మాస్ యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. బాలయ్య-బోయపాటి కాంబో అంటేనే ఒక రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. ఇది “అఖండ” సీక్వెల్ కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. దర్శక నిర్మాతలు అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాతో బాలకృష్ణ మాస్ హిరోగా తన స్థాయిని మరింత పెంచుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. బాలయ్య కెరీర్‌లో మరో గొప్ప విజయంగా నిలుస్తుందనే నమ్మకంతో “అఖండ 2” ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ క్రియేట్ చేసింది.