Dhanush: మా పెళ్లి రజినీకాంత్ కి ఇష్టం లేదు.. ధనుష్ కామెంట్స్ వైరల్.?
Dhanush: సమంత నాగచైతన్య విడాకుల తర్వాత సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో అత్యంత వైరల్ అయిన మరో వార్త ఐశ్వర్య ధనుష్ విడాకుల వార్త.. ఈ జంట ఎప్పుడైతే విడిపోతున్నారని ప్రకటించారో అప్పటి నుంచి ఇటు తెలుగు, అటు తమిళ ప్రజలకు షాక్ ఇచ్చినంత పని అయింది.. దాదాపు 20 సంవత్సరాల పాటు కలిసి కాపురం చేసిన ఈ జంట చివరికి విడాకులు తీసుకొని దూరమయ్యారు.. వీరి మధ్య ఏం జరిగింది ఆ వివరాలు ఏంటో చూద్దాం..
Rajinikanth doesnot like our marriage Dhanush Comments Viral
ధనుష్ తమిళ్ ఇండస్ట్రీలో అంతటి స్టార్ అవ్వడానికి కారణం తన అన్నయ్య సెల్వ రాఘవన్ కీలక పాత్ర పోషించారు. ఈయన మొదటి సారి నటించిన ‘తుల్లు ఇలమై’ చిత్ర సమయంలో ధనుష్ కు నటన రాదు. కానీ తన అన్న సెల్వ రాఘవన్ దగ్గరుండి నటించేలా చేశారు. కానీ ఈ చిత్రం బాక్సఫీస్ వద్ద కాస్త తడబడిపోయింది. ఈ మూవీ తర్వాత మరో చిత్రం కాదల్కొండెన్ తీశారు. ఈ చిత్రం అప్పట్లో యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాతనే రజినీకాంత్ ధనుష్ ను పిలిచి మనస్ఫూర్తిగా అభినందించారట.(Dhanush)
Also Read: KRK: పనిమనిషి ప్రియుడే సైఫ్ ని చంపాలనుకున్నాడా.. పరువు పోతుందని నిజం దాచారా.?
ఈ టైంలోనే ధనుష్ ఐశ్వర్య మధ్య స్నేహం ఏర్పడిందని అది కాస్త ప్రేమగా మారడంతో ఈ కుటుంబాలు మాట్లాడుకుని వివాహం జరిపించినట్టు తెలుస్తోంది. 20 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని గడిపిన వీరు గత సంవత్సరం విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే ఐశ్వర్యను ధనుష్ ఇవ్వడానికి తలైవా ఒప్పుకోలేదట. కానీ ధనుష్ పట్టుబట్టి మరీ ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నారట.. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ధనుష్ ను అడగగా.. నన్ను సినిమా బాగా చేసినందుకు తలైవార్ ప్రశంసించారు కానీ కూతురుని ఇవ్వలేదు.
ఆమె నేను ప్రేమించుకొని ఆయనను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ధనుష్ సినిమాల విషయానికొస్తే ఆయన హీరోగా కంటే దర్శకత్వం మీద ఎక్కువ దృష్టి సారించారు. తాజాగా తన అన్న కుమారుడు హీరోగా చేస్తున్న “నిలవొక్కు ఎన్ మేల్ ఎన్నడి కోవమ్” అనే చిత్రానికి దర్శకత్వం చేస్తున్నారు.(Dhanush)