Kollywood: వెయ్యి కోట్లు కొట్టడం కోలీవుడ్ కి కలేనా?
Kollywood: కోలీవుడ్ లో ఇప్పటివరకు వెయ్యి కోట్లు అందుకున్న సినిమా రానే లేదని చెప్పాలి. తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమల్లో ఇలాంటి సినిమా వస్తుంటే ఇక్కడ మాత్రం ఒక్క సినిమా మాత్రం రాలేదు. అందుకే కేజీఎఫ్ సినిమా నేపథ్యాన్ని ఎంచుకుని తన అదృష్టాన్ని పరిక్షిచుకుంటుంది. యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమా భారతీయ చలనచిత్ర రంగంలో సంచలన విజయం సాధించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (Kolar Gold Fields) నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను ఆ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.
Kollywood Tries to Collect 1000 Crores
అద్భుతమైన కథ, కథనంతో పాటు ప్రతిభావంతమైన నటన ఈ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఈ విజయం తర్వాత, దర్శక నిర్మాతలు అదే కోలార్ నేపథ్యాన్ని ఉపయోగిస్తూ మరిన్ని కథలను ప్రేక్షకులకు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే తంగలాన్ పేరుతో ఓ సినిమా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఆధారంగా తెరకెక్కగా ఈ చిత్రం ఆంగ్లేయుల సమయంలో జరిగిన సంఘటనలపై రాగా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.
బ్రిటిష్ ఆధిపత్యం, ఓ తెగకు ఎదురైన సమస్యలు, బంగారు నిల్వల చుట్టూ తిరిగే ఆశలు వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. కోలార్ నేపథ్యానికి కొత్త రంగులను చేర్చే ప్రయత్నం ఇది. ఈ సినిమా మాత్రమే కాకుండా కోలీవుడ్ లో ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ప్రకటించబడింది. ధనుష్, వెట్రిమారన్ కాంబినేషన్‌లో ఐదవ సినిమా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కనుంది.
ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ దశలో ఉంది. ఈ సినిమాలో గోల్డ్ మైనింగ్, సామాజిక అంశాలు, వాస్తవికతను కొత్త కోణంలో చూపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లు కేజీఎఫ్ విజయాన్ని కొనసాగించేలా ప్రయత్నిస్తుండటం విశేషం. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కథలు, వాటి వాస్తవికత, సాంకేతిక నైపుణ్యంతో, ప్రేక్షకులను మరోసారి అబ్బురపరచడం ఖాయం. మరి ఇప్పుడు రాబోయే ఈ సినిమా లు వెయ్యి కోట్ల మార్క్ ను అందుకుంటాయా అనేది చూడాలి.