Jani Master Case: గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న జానీ మాస్టర్ కేసు రోజుకోవిదమైన మలుపు తిరుగుతుంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. దీంతో జానీని అక్టోబర్ 3 వరకు రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, జానీ మాస్టర్ భార్య సుమలత మీడియాతో మాట్లాడారు.

Jani Master Case: Developments and Judicial Remand

సుమలత మాట్లాడుతూ, “జానీ మాస్టర్ ఎదగకుండా అడ్డుకునేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని” తెలిపారు. ఆ యువతికి ట్యాలెంట్ ఉన్నందువల్ల, జానీ ఆమెకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవకాశాన్ని ఇచ్చారని ఆమె వివరించారు. “జానీ స్టేజి డ్యాన్సులకు అవకాశాలు ఇచ్చినా, ఆమె ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తోంది?” అని ఆమె ప్రశ్నించారు.

Also Read: Rohit Sharma: విరాట్ కోహ్లి మీద చిరకుపడ్డ రోహిత్.. బంగ్లా మ్యాచ్ లో విడ్డూరం!!

అదేవిధంగా, “ఆమె 16 ఏళ్లకే అత్యాచారం జరిగిందని చెప్తున్నారు, కానీ అందుకు నిశ్చయంగా సాక్ష్యం ఉందా?” అని సుమలత అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఈ అమ్మాయి గతంలో చాలామంది కొరియోగ్రాఫర్లతో సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పారు.” ఈ వ్యవహారంపై ప్రజల మధ్య అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, కాగా జానీ మాస్టర్‌కు సంబంధించిన విచారణ ప్రస్తుతానికి కొనసాగుతోంది.

ఈ వ్యవహారంలో జానీ మాస్టర్‌తో పాటు అతడి భార్య అయేషా, అలియాస్ సుమల చుట్టూ పరిస్థితులు కష్టమైనట్టుగా కనిపిస్తున్నాయి. సుమలతపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం అందింది. జానీపై ఆరోపణలు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లిన సుమలత, ఆమెపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. జానీ మాస్టర్‌తో కలిసి ఆమె ఇంటికి వెళ్లిన సుమలత, అక్కడ ఆమెను వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదులో వివరించారు. “మీరు ఈ విషయాన్ని బయటకు చెప్పుకుంటే, మీ కెరీర్‌ను నాశనం చేస్తాం” అని హెచ్చరించినట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ సంఘటనలు వెలుగులోకి రాగానే, ఈ కేసులో జానీ మాస్టర్, అతడి భార్య మరియు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చాలని పోలీసులు నిర్ణయించారని సమాచారం ఉంది. ఈ వ్యవహారం తీవ్రంగా విచారణ చేయబడుతున్నందున, జానీ మాస్టర్ కుటుంబానికి మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి.