Chiranjeevi: విజయసాయి రెడ్డి స్థానంలో చిరంజీవికి చాన్స్,?
Chiranjeevi: ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా…. పూర్తిగా రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పారు. దీంతో ఏపీలో రాజ్యసభ సీటు ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఈ సీటు కూటమి నేతలలో ఎవరో ఒకరికి దక్కై ఛాన్స్ ఉంది.
Vijayasai reddy mp seat for chiranjeevi and kirankumarreddy
ఇలాంటి నేపథ్యంలో రాజ్యసభ సీటు కోసం చిరంజీవి అలాగే కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. బిజెపి పార్టీ తరఫున కిరణ్ కుమార్ రెడ్డికి ఈ పదవి దక్కుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు జనసేన పార్టీ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఎంపీ పదవి వస్తుందని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. నాగబాబుకు ఏపీ కేబినెట్లో మంత్రి పదవి వస్తుందని ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించిన సంగతి.. మనందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ రాజ్యసభ సీట్ కోసం జనసేన అలాగే బిజెపి పార్టీల మధ్య పోటీ నెలకొందని తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం చిరంజీవి లేదా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈ పదవి దక్కే ఛాన్స్. ఆ దిశగా కూటమి నేతలు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయగానే వెంటనే స్పీకర్ కూడా ఆమోదముద్ర వేశారు. ఒకవేళ చిరంజీవికి రాజ్యసభ సీటు వస్తే కేంద్రమంత్రి పదవి కూడా వచ్చే ఛాన్స్ ఉందట.