IND VS BAN: ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నాలుగవ రోజు బంగ్లాదేశ్ ను 280 పరుగుల తేడాతో ఓడించిన భారత్…. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా ఓటమి కన్నా ఎక్కువగా విజయాలను సాధించిన జట్టుగా నిలిచింది. బంగ్లా టైగర్స్ పై విజయం సాధించి టీమిండియా మొత్తంగా 581 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఈ 581 మ్యాచుల తర్వాత టీమిండియా ఇప్పుడు 179 విజయాలు, 178 ఓటములతో నిలిచింది.
Team India Create HISTORY, Record More Wins Than Losses in Tests For the First Time Ever
బంగ్లాతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడకముందు రెడ్ బాల్ ఫార్మాట్లో 179 విజయాలు, 178 ఓటములను కలిగి ఉంది. 1932లో లార్డ్స్ లో ఇంగ్లాండ్ తో భారత్ తొలి టెస్ట్ ఆడడం జరిగింది. సి.కే నాయుడు నేతృత్వంలోని భారత్ 158 పరుగుల తేడాతో ఇంగ్లీష్ చేతిలో ఓటమిపాలైంది. 1952లో చెన్నైలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో విజయాన్ని అందుకుంది. అదే వేదికగా ఇప్పుడు భారత్ తన 179వ టెస్టును గెలిచింది. కాగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా 280 పరుగులు తేడాతో విజయాన్ని అందుకుంది.
Also Read: Shakib Al Hasan: షకీబుల్ హసన్ ఫిక్సింగ్…నల్లదారం కొరుకుతూ బ్యాటింగ్ ?
ఆదివారం 515 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ను 234 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో టీమిండియా 1-0 ఆదిత్యంలో ఆదిక్యంలో నిలబడింది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగబోతోంది. ఈ విజయానికి హీరో రవిచంద్రన్ అశ్విన్ తొలి టెస్ట్ లో ఆరు వికెట్లు తీశాడు. అలాగే తొలి ఇన్నింగ్స్ లో 113 పరుగులు చేయడం జరిగింది.