Tandel movie: ‘తండేల్’..బాలీవుడ్ ‘గదర్’ తెలుగు స్పూఫ్ లా ఉందే?

Tandel movie inspired by Gadar film

Tandel movie: ప్రేమ కోసం మన హీరోలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని, తమ ప్రేమను గెలుచుకుంటారు. ఈ తరహా కథలు తెలుగు సినిమాల్లో తరచుగా కనిపిస్తుంటాయి. కానీ కొన్ని సినిమాల్లో ప్రేమ కోసం హీరోలు దేశ సరిహద్దులను దాటుతారు. తాజగా, టాలీవుడ్‌లో విడుదలైన తండేల్ ట్రైలర్ చూస్తే, హీరో దేశం బోర్డర్ దాటి తన ప్రేమను తిరిగి గెలుచుకోవడం కోసం తిరిగి వచ్చే కథలా కనిపిస్తుంది. ఈ సినిమాలో, కథ ఎలా ఉండబోతుందో తెలియదు కానీ ఓ సినిమా ను కథ ను పోలి ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tandel movie inspired by Gadar film

ఇలాంటి ప్రేమ కథలను గతంలో బాలీవుడ్‌లో గదర్ సినిమాలో కూడా చూసాం. ఆ సినిమాలో, హీరో తన ప్రేమ కోసం పాకిస్థాన్‌లోని లాహోర్ వరకు వెళ్లి అక్కడ యుద్ధం చేస్తాడు. ఆ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు తండేల్ కూడా అదే తరహా కథతో టాలీవుడ్ audiences ఆకట్టుకునే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. గదర్ స్థాయిలో తండేల్ సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.

తండేల్ ట్రైలర్ విడుదలతో సినిమా పట్ల అంచనాలు భారీగా పెరిగాయి. గదర్ స్ఫూర్తితో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించే విధంగా ఉందని నమ్మకంగా చెప్పవచ్చు. ఇలాంటి కథలు ప్రేక్షకులను అలరించడంలో ఎంతవరకు విజయం సాధిస్తాయో, తండేల్ సినిమాకి ఎంతమేర ప్రభావం చూపుతుందో బాక్సాఫీస్ వద్ద త్వరలో తెలుస్తుంది.

నాగ చైతన్య గత సినిమాలు పెద్దగా విజయాలు సాధించని నేపథ్యంలో తండేల్ సినిమా పై అంచనాలు భారీగా ఉండడం ఫ్యాన్స్ ను సంతోష పరిచే విషయం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో, ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతుందో ఫిబ్రవరి 4 న తెలియబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *