Cow Milk Vs Buffalo Milk: ఆవు పాలు, గేదె పాలు ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మంచిది అని తెలియక చాలామంది సతమతం అవుతారు. అయితే ఆవు పాలు చాలా తేలికగా ఉంటాయి. అవి తాగినా కూడా సులభంగా జీర్ణం అవుతాయి. గేదె పాలు కొంచెం చిక్కగా ఉండడం వల్ల అరగడానికి చాలా సమయం పడుతుంది. ఈ రెండు పాలల్లో ప్రధానమైన తేడాలు ఏంటంటే…. ఆవు పాలు, గేదె పాలలో కొవ్వు శాతంలో చాలా రకాలుగా తేడాలు ఉంటాయి. Cow Milk Vs Buffalo Milk

cow milk is better than buffalo milk

ఆవు పాలలో తేమశాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆవుపాలు చాలా పలుచగా కనిపిస్తాయి. సులభంగా జీర్ణం అవుతాయి. గేదె పాలలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. గేదె పాలు తాగడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. ఆవు పాలలో కన్నా గేదె పాలల్లోనే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. గేదె పాలల్లో ఎక్కువగా ఫ్యాట్ ప్రోటీన్లు ఉంటాయి. అందుకే శారీరక శ్రమ చేయని వారితోపాటు చిన్న పిల్లలు, ముసలి వారు గేదె పాలను తాగడం వల్ల జీర్ణం అవక ఇబ్బందులు పడతారు. అయితే శరీరానికి ఎక్కువ ప్రోటీన్లు అందించాల్సిన వారు గేదె పాలు తాగడం మంచిది. Cow Milk Vs Buffalo Milk

Also Read: Kalvakuntla Kavitha: రాజకీయాలకు కల్వకుంట్ల కవిత గుడ్ బై ?

మిగిలిన వారందరికీ ఆవు పాలు చాలా ఉత్తమం. ఆవు పాలలో నీటి శాతం అధికం అంటే సుమారు 87% కంటే ఎక్కువగా నీళ్లు ఉంటాయి. అందుకే వీటిని పల్చని నీళ్ల లాంటి పాలు అని పిలుస్తారు. ఇందులో పాల సాలిడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. గేదె పాలలో నీటి శాతం చాలా తక్కువ. కొలెస్ట్రాల్ పరంగా చూస్తే ఆవుపాలకన్నా గేదె పాలే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవు పాలలో 3.14mg/g కొలెస్ట్రాల్ ఉంటే…. గేదె పాలలో 0.65mg/g మాత్రమే ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్, బిపి, పిసిఒడి, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు గేదె పాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మిగతావారు ఆవు పాలు తాగడం మంచిది. Cow Milk Vs Buffalo Milk